Site icon HashtagU Telugu

Rajani Health Bulletin : రజినీకాంత్ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన డాక్టర్స్

Rajani Health Update

Rajani Health Update

Rajani Health Bulletin : సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ఆరోగ్యంపై చెన్నైలోని అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్ (Health Bulletin) విడుదల చేశారు. సోమవారం రాత్రి రజనీకాంత్ భరించలేని కడుపునొప్పి (Stomach Pain)తో చెన్నైలోని అపోలో ఆస్పత్రి (Apollo Hospital)లో చేరారు. రజనీని పరీక్షించిన వైద్యులు.. వెంటనే చికిత్స అందించారు. రజనీకాంత్‌ హాస్పటల్ లో చేరారనే విషయం తెలిసి అభిమానులు , సినీ ప్రముఖులు ఆయన ఆరోగ్యం ఫై అరా తీయడం మొదలుపెట్టారు. రజని త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరు ఆకాంక్షిస్తున్నారు. కొద్దీ సేపటి క్రితం డాక్టర్స్ రజనీ హెల్త్ బులిటెన్ ను విడుదల చేసారు. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో వాపు వచ్చిందని, దీనికి చికిత్స అందించామని పేర్కొన్నారు.

ప్రస్తుతం రజినీ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. రెండు రోజుల్లో ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని పేర్కొన్నారు. అభిమానులెవ్వరు ఖంగారు పడొద్దని..రజనీకాంత్ క్షేమంగా ఉన్నారని తెలిపారు. ఎప్పటిలాగానే షూటింగ్ లలో పాల్గొంటారని పేర్కొన్నారు. ప్రస్తుతం రజినీకాంత్ వెట్టయాన్‌, కూలి సినిమాలతో బిజీగా ఉన్నారు. వేట్టయాన్ (Vettaiyan) సినిమా విషయానికి వస్తే , ప్రముఖ డైరెక్టర్ టీ.జే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 10 న రిలీజ్ కాబోతుంది. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని సాంగ్స్ అదరగొడుతున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడం తో సినిమా ప్రమోషన్ల ఫై మేకర్స్ దృష్టి సారించారు. మరి ఇప్పుడు రజనీ ఆరోగ్యం ఇలా ఉండడం తో ఆయన ప్రమోషన్ లలో పాల్గొనే అవకాశం లేకపోవచ్చు.

Read Also : World Vegetarian Day : శాఖాహారిగా ఉండటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.. కాబట్టి నష్టాలు ఏమిటో తెలుసుకోండి.!

Exit mobile version