Mokshagna Debut : నందమూరి నటసింహం బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై మరో కొత్త విషయం బయటికి వచ్చింది. ఇందుకోసం బాలయ్య పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళితో కాంటాక్ట్ అయ్యారని తెలుస్తోంది. రాజమౌళి ఇంటికి వెళ్లి మరీ దీనిపై బాలయ్య డిస్కస్ చేశారట. ఇందుకు రాజమౌళి కూడా ఒప్పుకున్నారని తెలుస్తోంది. దీన్నిబట్టి రాజమౌళి దర్శకత్వంలోనే మోక్షజ్ఞను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని బాలయ్య కంకణం కట్టుకున్నారనే విషయం క్లియర్ అయిపోతోంది. ప్రస్తుతం మహేశ్ బాబు సినిమా పనుల్లో రాజమౌళి బిజీగా ఉన్నారు. దీంతో ఏపీ ఎన్నికలు ముగిసిన తర్వాతే మోక్షజ్ఞ మూవీ ఎంట్రీ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
వాస్తవానికి మోక్షజ్ఞ మొదటి సినిమా యూత్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా లవ్ స్టోరీ తోనే లాంచ్ చేయించాలని బాలయ్య భావించారు. అనిల్ రావిపూడికి ఆ బాధ్యతలు కూడా అప్పగించారని గతంలో టాక్ వినిపించింది. ఆ విషయం కన్ఫార్మ్ కాకముందే.. ఇప్పుడు మోక్షజ్ఞ రెండో సినిమా గురించి న్యూస్ బయటికి రావడం గమనార్హం. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తున్నారు. అది పూర్తి అవ్వగానే ఆయన మహాభారతం సిరీస్‌ను తెరకెక్కించాలని చూస్తున్నారు. ఇందులో మోక్షజ్ఞకు ఏదో ఒక చారిత్రాత్మక పాత్ర ని ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. లేకపోతే మోక్షజ్ఞతో సెపెరేట్ గా ఒక సినిమా తీసి , ఆ తర్వాత మహాభారతం తీస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇటీవల బాలయ్య ‘భగవంత్ కేసరి’ సినిమా షూటింగ్ లోకేషన్‌లో కూడా మోక్షజ్ఞ కనిపించాడు. శ్రీలీలతో కలిసి మోక్షజ్ఞ దిగిన ఫోటోలు నెట్టింట హల్ చల్ చేశాయి. ఇక ఆ లుక్ లో మోక్షజ్ఞ భలే ఉన్నాడు అంటూ కామెంట్స్ వినిపించాయి. ఒకప్పుడు లావుగా ఉండే మోక్షజ్ఞ.. సినిమాల కోసమే సైజు తగ్గినట్లు తెలుస్తోంది. ఇప్పుడు అతడు హ్యాండ్సమ్ లుక్ లోకి వచ్చేశాడు.