Site icon HashtagU Telugu

Rajamouli Daughter : రాజమౌళి కూతుర్ని చూశారా? అప్పుడే ఇంత పెద్దదైపోయిందా?

Rajamouli's daughter Mayookha came out after a long time

Rajamouli's daughter Mayookha came out after a long time

Rajamouli Daughter :  రాజమౌళి.. ఇప్పుడు ఈ పేరు మన రాష్ట్రం, దేశమే కాదు ప్రపంచంలో ఎవర్ని అడిగినా గుర్తుపట్టేస్తారు. బాహుబలి(Bahubali) సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమని దేశవ్యాప్తంగా తీసుకెళ్లి, RRR సినిమాతో తెలుగు సినిమాకు ఏకంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. ఆస్కార్(Oscar) ఇండియన్ సినిమాలకు వస్తుందా అనే కలతో బతికే వాళ్లందరికి అది నిజం చేసి చూపించి సరికొత్త చరిత్ర సృష్టించారు రాజమౌళి. హాలీవుడ్(Hollywood) లో కూడా టాప్ టెక్నిషన్స్ సైతం రాజమౌళి గురించి గొప్పగా మాట్లాడుతున్నారంటే మన సినిమాకు రాజమౌళి(Rajamouli) ఎంత గౌరవం, గొప్పతనం తెచ్చాడో అర్ధం చేసుకోవచ్చు.

రాజమౌళి భార్య రమా రాజమౌళి అందరికి తెలుసు. రాజమౌళి ప్రతి సినిమాకు రమా కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తుంది. ఇక రాజమౌళి తనయుడు కార్తికేయ రాజమౌళి సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్ గా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోనూ పని చేస్తాడు. ఆస్కార్ క్యాంపెయిన్ లో కార్తికేయ కీలక పాత్ర వహించాడు. అందుకే కీరవాణి సైతం ఆస్కార్ వేదికపై ఎవరిపేరు చెప్పకుండా కార్తికేయకు థ్యాంక్స్ చెప్పాడు. రాజమౌళికి ఒక కూతురు ఉందని కొంతమందికి తెలుసు.

గతంలో రాజమౌళి కూతురి ఫోటోలు ఆమె చిన్నగా ఉన్నప్పుడు బయటకు వచ్చాయి. ఇటీవల కాలంలో రాజమౌళి కూతురు ఎక్కడా కనపడలేదు. తాజాగా RRR సినిమా కెమెరామెన్ సెంథిల్ కుమార్ RRR సినిమా ఇంతటి ఘన విజయం సాధించినందుకు చిత్రయూనిట్ కు, పలువురు సినీ ప్రముఖులకు, తన క్లోజ్ ఫ్రెండ్స్ కు స్పెషల్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి రాజమౌళి, కీరవాణి ఫ్యామీలలతో సహా వచ్చారు. చరణ్, మనోజ్, మనోజ్ భార్య మౌనిక, మంచు లక్ష్మి, అడివి శేషు.. ఇలా పలువురు సినీ ప్రముఖులు వచ్చారు.

అయితే ఈ పార్టీకి రాజమౌళి ఫ్యామిలీ మొత్తం వచ్చింది. రాజమౌళి, రమా రాజమౌళి, కార్తికేయ, కార్తికేయ భార్య పూజలతో పాటు రాజమౌళి కూతురు మయూఖ కూడా వచ్చింది. చాలా రోజుల తర్వాత మయూఖ బయట పార్టీలో కనపడటంతో ఆమె ఫోటోలు వైరల్ గా మారాయి. రాజమౌళి కూతురు ఇంత పెద్దయి అయిపోయిందా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

 

Also Read :   NTR Wife: చార్మినార్ లో షాపింగ్ చేసిన ఎన్టీఆర్ భార్య.. ఫిదా అవుతున్న నెటిజన్స్?