నేషనల్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ‘పుష్ప-2’ (Pushpa 2 Trailer ) ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. అభిమానులు , సినీ ప్రేక్షకులే కాదు అగ్ర దర్శకులు , నిర్మాతలు , సినీ ప్రముఖులు ఇలా ప్రతి ఒక్కరు స్పందిస్తూ..సినిమా పై మరింత క్రేజ్ తీసుకొస్తున్నారు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి ట్వీట్ చేస్తూ..పుష్ప పార్టీ ఎప్పుడు అంటూ అడిగాడు. అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో తెరకెక్కిన పుష్ప 2 డిసెంబర్ 05 న వరల్డ్ వైడ్ గా అనేక భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సినిమా పై ఎలాంటి అంచనాలు నెలకొన్నాయో చెప్పాల్సిన పనిలేదు. సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులు ఏమాత్రం తీసిపోని రీతిలో సినిమా తెరకెక్కిందని తాజాగా విడుదలైన ట్రైలర్ చెప్పకనే చెపుతుంది.
పుష్ప 2 సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (Pushpa 2 Trailer Launch) నిన్న ఆదివారం సాయంత్రం పాట్నా(Patna)లో గాంధి మైదాన్ లో అట్టహాసంగా జరిగింది. UV మీడియా ఈ ఈవెంట్ ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఊహించినదానికంటే ఎక్కువ మంది తరలివచ్చారు. దీంతో గాంధీ స్టేడియం ఇసుకేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోయింది. నార్త్ండియాలో మన తెలుగు హీరోకు ఇంత క్రేజ్ ఉండడం చూసి నార్త్ హీరోలు , సినీ ప్రముఖులుషాక్ అవుతున్నారు.
ఇక ట్రైలర్ కటింగ్ కూడా అదిరిపోయింది. సీక్వెల్లో పుష్ప ఇంటర్నేషనల్ లెవెల్లో ఎదిగిపోయినట్లు చూపించారు. ప్రతి షాట్ ఊర మాస్‌గా ఉంది. ఫుల్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీన్స్‌తో సుకుమార్ సినిమాపై అంచనాలు మరో లెవెల్‌కు తీసుకెళ్లారు. బన్నీ డైలాగ్స్, మేనరిజం మరోసారి ట్రెండ్ సెట్ చేయనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక పోలీస్ ఆఫీసర్ బన్వర్ సింగ్ షెఖావత్ పాత్ర కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. ‘పుష్ప అంటే ఫైర్ కాదు- వైల్డ్ ఫైర్’ అనే కొత్త డైలాగ్‌తో ఈసారి బన్నీ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపబోతున్నట్లు అర్ధం అవుతుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. ట్రైలర్ చూసిన పలువురు సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ లోడింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
తాజాగా దర్శకధీరుడు రాజమౌళి ట్వీట్ చేశారు. ‘పట్నాలో WILDFIRE మొదలైంది. దేశమంతటా విస్తరిస్తోంది. డిసెంబర్ 5న పేలనుంది. పార్టీ కోసం ఎదురుచూస్తుంటా పుష్ప’ అని పేర్కొన్నారు. ఇక రాజమౌళి లాంటి పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశంసలు కురిపించడం తో బన్నీ అభిమానుల సంతోషం మాములుగా లేదు.
WILDFIRE started in Patna!!
Spreading across the country!!
Explodes on Dec 5th!!!CAN’T WAIT for the party PUSHPA!!!
— rajamouli ss (@ssrajamouli) November 18, 2024
Read Also : Lady Aghori Arrest : పోలీసులపై దాడి చేసిన అఘోరీ