దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) ప్రభాస్ (Prabhas) కలయికలో వచ్చిన బాహుబలి(Baahubali) మూవీ ఎంతటి విజయం అందుకుందో అందరికి తెలిసిందే. కేవలం విజయం మాత్రమే కాదు, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సినిమాలు తీసే విధానాన్ని కూడా మార్చేసింది. బాహుబలితో ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఇండియన్ మూవీస్ పరిధి కూడా పెరిగింది. ఇక్కడి సినిమాల పై హాలీవుడ్ ఆడియన్స్ లో ఆసక్తి మొదలైంది.
ఇక అసలు విషయానికి వస్తే.. బాహుబలి 1 ఇంటర్వెల్ ఎక్కడ పడుతుందో అందరికి తెలిసిందే. భల్లాలదేవ విగ్రహావిష్కరణ జరుగుతున్న సమయంలో ప్రజలంతా బాహుబలి అని అరవడంతో బాహుబలి విగ్రహం ఆకాశం ఎత్తులో కనిపిస్తూ ఇంటర్వెల్ పడుతుంది. అయితే రాజమౌళి ముందుగా వేరే ఇంటర్వెల్ ని రాసుకున్నాడట. బాహుబలి కొడుకు శివుడు మాహిష్మతికి వచ్చినప్పుడు దేవసేన.. “మాహిష్మతి ఊపిరి పీల్చుకో.. నా కొడుకు వచ్చాడు. బాహుబలి తిరిగొచ్చాడు” అనే చెప్పిన డైలాగ్ తో ఇంటర్వెల్ అనుకున్నాడట.
ఆ సీన్ కి ముందు శివుడు మంచు కొండల్లో ఫైట్ చేస్తున్నప్పుడు ఒక సైనికుడు శివుడిని బాహుబలి అనుకోని ‘ప్రభూ నన్ను ఏమి చేయొద్దు’ అని చెప్పి అక్కడి నుంచి పారిపోతాడు. అలా పారిపోయిన సైనికుడు మాహిష్మతి వెళ్లి బిజ్జలదేవుడికి బాహుబలిని చూసినట్లు చెబుతాడు. అప్పుడు బిజ్జలదేవుడు చెబుతున్న డైలాగ్స్‌కి.. ప్రభాస్ మంచు కొండల దగ్గర నుంచి మాహిష్మతి వరకు వచ్చే సీన్ ఎలివేషన్స్ తో రాశారు.
బాహుబలి ప్రాణాలను మట్టిలో కలిపేశాం అని బిజ్జలదేవుడు చెప్పగానే శివుడు మట్టి గోడను బద్దలు కొట్టుకొని వస్తాడు. వాడి శరీరాన్ని మంటల్లో కాల్చేశాం అని చెప్పినప్పుడు శివుడు మంటలు దాటుకొని వస్తాడు. ఇలా ప్రతి ఘట్టాన్ని డైలాగ్ తో ఎలివేట్ చేశారు. అయితే ఆ డైలాగ్స్ తీసేయడంతో ప్రభాస్ వచ్చే సీన్స్ కి ‘నిప్పులే శ్వాసగా’ సాంగ్ ని పెట్టి నడిపించారు. ఇక డైలాగ్స్ తీసేయడంతో ఇంటర్వెల్ సీన్ దీనికంటే విగ్రహావిష్కరణది బాగుంటుందని అక్కడ ఇంటర్వెల్ వేశారు. ఇక ఆ విగ్రహావిష్కరణ సీన్ థియేటర్లో ఏ రేంజ్ లో పేలిందో అందరికి తెలిసిందే.
Also Read : BRO Trailer : ఈ థియేటర్స్ లలో ‘బ్రో’ ట్రైలర్ ను ప్రదర్శించబోతున్నారు