Rajamouli : RRR కాంబో రిపీట్ చేయబోతున్నారా.. మహేష్ కోసం రాజమౌళి మాస్టర్ ప్లాన్..!

Rajamouli RRR తర్వాత రాజమౌళి చేయబోతున్న సినిమాలో మహేష్ హీరోగా నటిస్తున్నాడని తెలిసిందే. దుర్గా ఆర్ట్స్ క్రియేషన్స్ లో కె.ఎల్ నారాయణ తో పాటుగా ఈ సినిమాలో హాలీవుడ్ సంస్థ కూడా నిర్మాణ భాగస్వామ్యం

Published By: HashtagU Telugu Desk
Mahesh Rajamouli Budget Locked

Mahesh Rajamouli Budget Locked

Rajamouli RRR తర్వాత రాజమౌళి చేయబోతున్న సినిమాలో మహేష్ హీరోగా నటిస్తున్నాడని తెలిసిందే. దుర్గా ఆర్ట్స్ క్రియేషన్స్ లో కె.ఎల్ నారాయణ తో పాటుగా ఈ సినిమాలో హాలీవుడ్ సంస్థ కూడా నిర్మాణ భాగస్వామ్యం అవుతుందని తెలుస్తుంది. ఈ సినిమాకు హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా కొందరు పనిచేస్తారని తెలుస్తుంది.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఇండోనేషియా బ్యూటీ నటిస్తుందని వార్తలు వచ్చాయి కానీ అందులో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తుంది.

రాజమౌళి ఇంకా మహేష్ సినిమా కాస్టింగ్ ని ఫైనల్ చేయలేదు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలా అన్న ఆలోచనలో ఉన్నారట. అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం ఆర్.ఆర్.ఆర్ సినిమాలో సీత పాత్ర చేసిన అలియా భట్ నే ఈ మూవీలో కూడా తీసుకోవాలని రాజమౌళి ఆలోచిస్తున్నాడట. ట్రిపుల్ ఆర్ తో ఆల్రెడీ అలియా తో వర్క్ చేసిన జక్కన్న ఆమె డెడికేషన్ నచ్చి మరో ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాడట.

మహేష్ పక్కన అలియా భట్ పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. అలియా భట్ కూడా ఇచ్చిన ఎలాంటి పాత్ర అయినా అదరగొట్టేస్తుంది. బాలీవుడ్ లో ఆల్రెడీ దూసుకెళ్తున్న అమ్మడు సౌత్ సినిమాల మీద కూడా ఫోకస్ చేస్తుంది.

మహేష్ సినిమాలో అలియా హీరోయిన్ అయితే మాత్రం ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పొచ్చు. తప్పకుండా అలియా భట్ కు ఇదో గొప్ప అవకాశమని చెప్పొచ్చు.

Also Read : Om Bheem Bush 3 Days worldwide Collections : 3 రోజులు 17 కోట్లు.. బ్లాక్ బస్టర్ దిశగా ఓం భీమ్ బుష్..!

  Last Updated: 25 Mar 2024, 04:57 PM IST