Rajamouli Mahesh సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై భారీ ప్లానింగే జరుగుతుంది. ఈ సినిమాను కె.ఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా విషయంలో రాజమౌళి కొత్త ప్లాన్ చేస్తున్నారట. అదేంటి అంటే రెమ్యునరేషన్ లేకుండా సినిమాకు పనిచేయాలని అనుకుంటున్నాడట. మహేష్ ని కూడా అదే విధంగా రెమ్యునరేషన్ లేకుండా పని చేయాలని అంటున్నారట.
We’re now on WhatsApp : Click to Join
సినిమా రెమ్యునరేషన్ లకే సగం బడ్జెట్ పోతుంది కాబట్టి సినిమా రూపొందించడం కోసం నిర్మాత ఖర్చు పెట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారట. ఎలాగు సినిమా బిజినెస్ భారీగా జరుగుతుంది కాబట్టి దానిలో ప్రాఫిట్స్ తీసుకునేలా ప్లాన్ చేస్తున్నారట. సో అలా అయితే మహేష్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం అవుతున్నట్టే లెక్క.
మామూలుగా అయితే మహేష్ సినిమాకు 50 కోట్లకు అటు ఇటుగా తీసుకుంటాడని టాక్. అదే ఇలా రెమ్యునరేషన్ లేకుండా సినిమా చేసి బిజినెస్ ప్రాఫిట్స్ తో కలిపి తీసుకుంటే డబుల్ రెమ్యునరేషన్ అంటే దాదాపు 100 కోట్ల పైన రెమ్యునరేషన్ అందుకునే ఛాన్స్ ఉంటుంది. రాజమౌళి ప్రపోజల్స్ కి మహేష్ ఓకే అన్నట్టు టాక్. మొత్తానికి మహేష్ 29వ సినిమాకు రాజమౌళి సూపర్ స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది.
Also Read : Lavanya Tripathi : వైజాగ్ బీచ్ ను శుభ్రం చేయబోతున్న లావణ్య త్రిపాఠి.. అదంతా దానికోసమే?