Site icon HashtagU Telugu

Rajamouli : రాజమౌళిని సిరివెన్నెల అలా పిలిచేవారా.. బాహుబలి టైమ్ లో ఆయన రాజమౌళికి ఏం చెప్పారు..!

Rajamouli

Rajamouli

Rajamouli సిరివెన్నెల సీతారామ శాస్త్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఈటీవీలో ప్రసారమవుతున్న కార్యక్రమం నా ఉచ్ఛ్వాసం కవనం. ఈ షోకి దర్శకధీరుడు రాజమౌళి గెస్ట్ గా వచ్చారు. సిరివెన్నెల గారితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు రాజమౌళి. సిరివెన్నెల గారు మాత్రమే తనను నంది అని పిలుస్తారని. అలా పిలిచే ఏకైక వ్యక్తి ఆయనే అని అన్నారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా తండ్రి విజయేంద్ర ప్రసాద్ నిర్మతగా చేసిన అర్ధాంగి సినిమా వల్ల డబ్బులు పోగొట్టుకుని నిరాశలో ఉండగా సిరివెన్నెల గారి దగ్గరకు వెళ్లి ఎప్పుడు ఒప్పుకోవద్దు ఓటమిని సాంగ్ రాయించుకొచ్చానని.. ఆ పాట ఇప్పటికీ తనకు ఎంతో స్పూర్తిగా ఉంటుందని అన్నారు రాజమౌళి.

బాహుబలి సినిమా ఇలా రెండు భాగాలుగా తీద్దామని అనుకుంటున్నానని సిరివెనెల్ల గారితో చర్చించా.. ఆయన కూడా గొప్ప ఆలోచన అన్నారని రాజమౌళి గుర్తు చేసుకున్నారు. RRR లో దొస్తీ సాంగ్ రాయించా కానీ మరో సాంగ్ రాయిద్దామని అనుకున్నా అప్పటికే ఆయన ఆరోగ్యం క్షాణించింది. అయితే ఆయన ఇచ్చిన కొన్ని పదాలను వాడుకుని సాంగ్ చేశామని అన్నారు రాజమౌళి.

తెలుగు సినీ ప్రపంచానికి సిరివెన్నెల గారు చేసిన సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఆయన రాసిన పాట ప్రేక్షకులకు శ్రవానందం కలిగించడమే కాదు పాట అర్ధాన్ని తెలుసుకునే జ్ఞానాన్ని కూడా కలిగించింది. కేవలం తెలుగు రైటర్ కావడం వల్లే సిరివెన్నెల గారు గొప్పగా గుర్తించబడలేదని త్రివిక్రం ఒక సందర్భంలో మాట్లాడిన విషయం తెలిసిందే.

Also Read : Anirudh Ravichandran : దేవర సాంగ్.. అనిరుద్ ఇది ఊహించలేదుగా..!