Site icon HashtagU Telugu

Theatres Bandh Issue : రాజమండ్రి జనసేన ఇంచార్జ్ పై వేటు

Rajahmundry In Charge Atthi

Rajahmundry In Charge Atthi

రాజమండ్రిలో థియేటర్ల బంద్ (Theatres Bandh) వివాదం పెద్ద దుమారాన్ని రేపుతోంది. ఈ అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తీవ్రంగా స్పందిస్తూ, పార్టీకి చెందిన వారైనా సరే ఉపేక్షించరాదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ రాజమండ్రి ఇంచార్జ్ అత్తి సత్యనారాయణ (Jana Sena Party Rajahmundry in-charge Atthi Satyanarayana) థియేటర్ల బంద్‌కు మొదటి ప్రతిపాదకుడిగా పేరుపడడంతో అతనిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ, తూర్పుగోదావరి జిల్లా ఎగ్జిబిటర్ల సమావేశంలో అత్తి సత్యనారాయణే థియేటర్ల బంద్ ప్రస్తావన తీసుకొచ్చినట్లు తెలిపారు.

Rise Of Nara Lokesh: జయహో నారా లోకేశ్.. ఫలించిన ‘దశాబ్ద’ పోరాటం.. జన నేతకు టీడీపీ ప్రమోషన్

అత్తి సత్యనారాయణ అనుశ్రీ ఫిల్మ్స్ అనే బ్యానర్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేస్తూ, కొన్ని థియేటర్లను నిర్వహిస్తున్నారు. ఆయన తీసుకొచ్చిన బంద్ ప్రతిపాదన వెనుక వైసీపీకి చెందిన మరో థియేటర్ ఎగ్జిబిటర్ ప్రేరణ ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటూ, పార్టీపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చన్న ఆందోళనతో పవన్ కల్యాణ్ చర్యలకు దిగారు. పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించిన ఏ నేతనైనా ఉపేక్షించరాదని ఆయన ఆదేశించడంతో అత్తి సత్యనారాయణ పరిస్థితి దిగజారింది.

Mahanadu : పరీక్షల్ని ఎదుర్కొన్న ప్రతిసారీ విజయం సాధించాం – చంద్రబాబు

పవన్ కల్యాణ్ ఇటీవ‌ల ప్రభుత్వ శాఖ‌ల‌ను సినిమా హాళ్ల నిర్వహణ విషయంలో పకడ్బందీగా వ్యవహరించాలని సూచించారు. టికెట్ ధరల పెంపు విషయంలో నిర్మాతలు వ్యక్తిగతంగా కాకుండా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ద్వారా ప్రభుత్వాన్ని సంప్రదించాలన్నారు. రాబోయే హరిహర వీరమల్లు సినిమాకు సైతం ఇదే విధానాన్ని పాటించాలని స్పష్టంగా తెలిపారు. థియేటర్ బంద్, టికెట్ ధరలపై ముద్ర పడకుండానే వ్యవహరించాలన్న పవన్ సూచనలు సినీ పరిశ్రమకు గణనీయ మార్గనిర్దేశంగా మారాయి.