Site icon HashtagU Telugu

Prabhas Raja Saab : రాజా సాబ్ కథ.. అర్రెర్రె అనేసిన మారుతి..!

Prabhas Raja Saab Teaser Feast for Dasara

Prabhas Raja Saab Teaser Feast for Dasara

Prabhas Raja Saab మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా రాజా సాబ్. సంక్రాంతి కానుకగా ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు. లుంగీ లుక్ తో ప్రభాస్ రెబల్ ఫ్యాన్స్ ని అలరించారు. రాజా డీలక్స్, రాయల్, అంబాసిడర్ ఇలా చాలా టైటిల్స్ పరిశీలించిన టీం ఫైనల్ గా రాజా సాబ్ ని ఎంపిక చేసింది. ఈ సినిమాను కూడా ప్రభాస్ పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు. బాహుబలి నుంచి ప్రభాస్ చేస్తున్న ప్రతి సినిమా పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సలార్ 1 రెబల్ ఫ్యాన్స్ ఆకలి తీర్చేలా సినిమా రిజల్ట్ అందుకుంది.

We’re now on WhatsApp : Click to Join

ఇదిలాఉంటే ప్రభాస్ రాజా సాబ్ సినిమాపై ఐ.ఎం.డి.బి పోస్ట్ పై డైరెక్టర్ మారుతి రెస్పాండ్ అయ్యాడు. ఐ.ఎం.డి.బి లో ఏ సినిమా గురించి అయినా సరే కథ గురించి కొంత పెడతారు. అయితే రాజా సాబ్ గురించి కూడా ఒక కథ పెట్టారు. ప్రేమలో పడిన జంటకు దుష్ట శక్తుల వల్ల ఎదురయ్యే కష్టాలు.. వాటిని ఎదురించేందుకు విధిని సైతం ఎదురించేలా హీరో పోరాట అంశాలతో రాజా సాబ్ వస్తుందని ఐ.ఎం.డి.బి రాసుకొచ్చింది. అయితే దీని స్క్రీన్ షాట్ ని మారుతి షేర్ చేస్తూ ఫన్నీగా రెస్పాండ్ అయ్యారు.

అర్రెరె నాకు ఈ స్టోరీ లైన్ తెలియక మరో స్క్రిప్ట్ తో సినిమా తీస్తున్నాను.. ఇప్పుడు ఐ.ఎం.డి.బి నా స్క్రిప్ట్ ను అంగీకరిస్తుందో లేదో అని రాసుకొచ్చారు. ఐ.ఎం.డి.బి స్టోరీకి మారుతి ఇచ్చిన ఫన్నీ రిప్లై నెటిజెన్లను ఆకట్టుకుంటుంది. మీ సినిమాలే కాదు మీ పంచులు కూడా నవ్వులు తెప్పిస్తాయని నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. రాజా సాబ్ సినిమా విషయానికి వస్తే రాజా డీలక్స్ అనే థియేటర్ చుట్టూ కథ తిరిగుతుందని తెలుస్తుంది.

Also Read : Trivikram : అల్లు అర్జున్ కాదు త్రివిక్రం నెక్స్ట్ అతనితో..!

ఈ సినిమాతో మాళవిక మోహనన్ హీరోయిన్ గా తెలుగు ఎంట్రీ ఇస్తుంది. ఇదివరకు ఆమె మాస్టర్ అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చింది. ప్రభాస్ సినిమాతో అమ్మడు గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమా తర్వాత మాళవికకు తెలుగులో మంచి డిమాండ్ ఏర్పడుతుందని చెప్పొచ్చు. ప్రభాస్ మారుతి ఈ కాంబో అసలు ఊహించని ఫ్యాన్స్ సినిమాపై ముందు పెద్దగా ఫోకస్ చేయకపోయినా రాజా సాబ్ పోస్టర్ వచ్చాక మాత్రం సినిమాపై అంచనాలు పెంచుకున్నారు. ఈ సినిమాతో పాటుగా ప్రభాస్ కల్కి 2898 ఏడి సినిమా చేస్తున్నారు.