Raj Tarun -Malvi Press Meet : మీడియా ముందుకు రాజ్ తరుణ్..మాల్వీ మల్హోత్రా

తిరగబడరా సామి నిర్మాత మల్కాపురం శివ ఎలాగైతే తమ సినిమాకు కూడా పెద్ద నష్టమే వచ్చే ప్రమాదం ఉందని భావించి..సినిమా ప్రమోషన్ల కోసం రాజ్ తరుణ్, మాల్వీ తీసుకువస్తున్నారట

Published By: HashtagU Telugu Desk
Raj Tarun Malvi

Raj Tarun Malvi

రాజ్ తరుణ్..మాల్వీ మల్హోత్రా (Malvi Malhotra , Raj Tarun )..గత కొద్దీ రోజులుగా మీడియా లో ఈ ఇద్దరి పేర్లు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. కెరియర్ అంతంతమాత్రంగా ఉన్న క్రమంలో యంగ్ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. షార్ట్స్ ఫిలిమ్స్ తో ప్రేక్షకులను అలరించిన రాజ్..ఆ తర్వాత ఉయ్యాలా జంపాల మూవీ తో వెండితెర కు హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే యూత్ ను ఆకట్టుకున్న తరుణ్..ఆ తర్వాత వరుస హిట్ల తో అతి తక్కువ టైంలోనే బిజీ హీరో అయ్యాడు. కానీ ఆ తర్వాత కథల ఎంపికలో తప్పటడుగు వేసి వరుస ప్లాప్స్ మూటకట్టుకున్నాడు.

గత కొద్దీ రోజులుగా హిట్ అనేది లేకుండా పోయిన రాజ్ తరుణ్ కు సురక్ష ఎంట‌ర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్‌ లో హీరోగా నటించే ఛాన్స్ వచ్చింది. ఎ.ఎస్.రవికుమార్ చౌదరి డైరెక్షన్లో రాజ్‌తరుణ్‌, మాల్వీ మల్హోత్రా, మకరంద్‌ దేశ్‌పాండే, జాన్‌ విజయ్‌ ప్రధాన పాత్రలలో ‘తిరగబడర సామి ‘ (Thiragabadara Saami) తెరకెక్కింది. ఈ సినిమాను జులై 19 న ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని అనుకున్నారు.. తీరా రిలీజ్ టైం లో రాజ్ తరుణ్ తనను వాడుకొని వదిలేసాడంటూ అతడి మాజీ లవర్ లావణ్య పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం వార్తల్లో నిలిచేలా చేసింది. ఈ ఇష్యూ సంచలనంగా మారడం..రాజ్ తరుణ్ ఫై పోలీసులు సైతం కేసు నమోదు చేయడం తో ‘తిరగబడర సామి ‘ చిత్రాన్ని ఆగస్టు 2 కు వాయిదా వేశారు.

We’re now on WhatsApp. Click to Join.

‘తిరగబడర సామి ‘ హీరోయిన్ మాల్వీ మల్హోత్రా తో ప్రేమలో పడి రాజ్ తరుణ్ తనను దూరం పెట్టాడని లావణ్య ఆరోపిస్తుండడం..మీడియా లో కూడా రాజ్ తరుణ్ – మాల్వీ మల్హోత్రా పేర్లు వైరల్ కావడం తో ఈ ఇద్దరు కొద్దీ రోజులుగా మీడియా కు దూరంగా ఉన్నారు. వీరిద్దరూ జంటగా నటించిన ‘తిరగబడర సామి ‘ ప్రమోషన్ లలో కూడా పాల్గొనలేదు. ఇక వీరు ప్రమోషన్ చేయకపోవడం..వీరిద్దరి వ్యవహారం వివాదాస్పదం కావడం..మరోపక్క రాజ్ తరుణ్ నటించిన పురుషోత్తముడు కూడా గత వారం విడుదల కాగా కనీసం పోస్టర్ల ఖర్చు అంత కూడా రాబట్టలేకపోవడం తో ..తిరగబడరా సామి నిర్మాత మల్కాపురం శివ ఎలాగైతే తమ సినిమాకు కూడా పెద్ద నష్టమే వచ్చే ప్రమాదం ఉందని భావించి..సినిమా ప్రమోషన్ల కోసం రాజ్ తరుణ్, మాల్వీ తీసుకువస్తున్నారట. రేపు లేదా ఎల్లుండి ఈ ప్రెస్ మీట్ ఉండే అవకాశాలున్నాయని తెలుస్తుంది. ఇక కాంట్రవర్సీకి కారణమైన ఇద్దరు వస్తున్నారంటే.. కచ్చితంగా లావణ్య ఇష్యూపై ప్రశ్నలు ఎదురు అవుతాయి. వీటన్నింటికి ప్రిపైర్ అయ్యే ఇద్దరు మీడియా ముందుకు రాబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటి వరకు తాను మీడియా ముందుకు రాకపోవడం వల్ల సినిమాకు, నిర్మాతలకు నష్టం వాటిల్లడం వల్ల..ఈ రిస్క్ చేస్తున్నాడట రాజ్ తరుణ్. మరి మీడియా ప్రశ్నల బారినుండి ఎలా తట్టుకుంటాడో చూడాలి.

Read Also : International Cricket Stedim : హైదరాబాద్ లో మరో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం..

  Last Updated: 30 Jul 2024, 10:01 PM IST