Raj Tarun : గత కొన్ని రోజులుగా రాజ్ తరుణ్ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. లావణ్య అనే యువతి రాజ్ తరుణ్ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని అబార్షన్ చేయించి మోసం చేసాడని, ఇప్పుడు నన్ను వదిలేసి హీరోయిన్ మాల్వి మల్హోత్రాని పెళ్లి చేసుకోబోతున్నాడని, మాల్వి నన్ను బెదిరించిందని ఆరోపణలు చేస్తూ రాజ్ తరుణ్, మాల్విపై కేసు పెట్టింది.
ఇప్పటికే ఈ కేసులో పోలీసులు రాజ్ తరుణ్ ని విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఈ గొడవ మొదలయిన దగ్గర్నుంచి రాజ్ తరుణ్ ఒక్కసారి మాత్రమే మీడియా ముందుకు వచ్చి.. లావణ్యతో రిలేషన్ లో ఉన్న మాట నిజమే కానీ ఆమె డ్రగ్స్ కి అలవాటు పడింది, వేరే వాళ్ళతో రిలేషన్ ఉంది అందుకే బ్రేకప్ చెప్పాను అని తెలిపాడు. అయితే ఈ విషయంలో మీడియా నుంచి, తెలిసిన వాళ్ళ దగ్గర్నుంచి రాజ్ తరుణ్ కి ప్రెజర్ ఎక్కువైంది. అందరూ ఈ కేసు గురించి మాట్లాడటానికి రాజ్ తరుణ్ కి కాల్స్, మెసేజ్ లు చేస్తున్నారు. దీంతో రాజ్ తరుణ్ తన ఫోన్ నంబర్ ని మార్చేశారు.
తాజాగా రాజ్ తరుణ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో.. నేను 1122తో ఎండ్ అయ్యే నా ఫోన్ నంబర్ ని వాడట్లేదు. నేను ఫోన్ నంబర్ మార్చాను. దయచేసి నా పాత నంబర్ కి ఫోన్స్, మెసేజ్ లు చేయకండి అని పోస్ట్ చేసాడు. దీంతో రాజ్ తరుణ్ మరోసారి చర్చగా మారాడు. మరి ఈకేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
Also Read : Pushpa 2 : పుష్ప 2 గొడవలకు ఫుల్ స్టాప్.. పుష్ప షూట్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..