Raj Tarun : గత కొన్నాళ్లుగా రాజ్ తరుణ్ ఓ వివాదంలో నిలిచిన సంగతి తెలిసిందే. లావణ్య అనే అమ్మాయి రాజ్ తరుణ్ పై పలు ఆరోపణలు చేసింది. రాజ్ తరుణ్ సినిమా రిలీజ్ కి రెడీగా ఉన్నప్పుడల్లా మీడియా ముందుకు వచ్చి హడావిడి చేసేది. రోజుకొక కొత్త స్టోరీ చెప్పి ఆరోపణలు చేసేది. అయితే రాజ్ తరుణ్ మాత్రం ఒకే ఒక్కసారి అవన్నీ ఆరోపణలే అని రెస్పాండ్ అయి ఆ తర్వాత దాని గురించి కూడా మాట్లాడలేదు. అయితే రాజ్ తరుణ్ పై పలువురు వివాదాలు సృష్టిస్తున్నా అతను మాత్రం అదేమీ పట్టించుకోకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు.
నేడు రాజ్ తరుణ్ పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమాని ప్రకటించాడు. ఇన్నాళ్లు తెలుగులో మెప్పించిన రాజ్ తరుణ్ ఇప్పుడు తమిళ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. రాజ్ తరుణ్ కథానాయకుడిగా తమిళ, తెలుగు భాషల్లో ద్విభాషా చిత్రంగా ఏక కాలంలో ఈ సినిమా తెరకెక్కనుంది. తమిళ్ స్టార్ సినిమాటోగ్రఫర్, డైరెక్టర్ గా పలు సినిమాలు చేసిన డైరెక్టర్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రాజ్ తరుణ్ తమిళ్ – తెలుగు బై లింగ్వల్ సినిమాని ప్రకటించారు.
విజయ్ మిల్టన్ తీసిన గోలీసోడా ఫ్రాంఛైజీలోనే రాజ్‌తరుణ్‌తో సినిమా ఉండబోతుందని సమాచారం. రఫ్‌నోట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇన్నాళ్లు తెలుగులో మెప్పించిన రాజ్ తరుణ్ ఇప్పుడు తమిళ్ లో ఏ రేంజ్ లో ఎంట్రీ ఇస్తాడో చూడాలి. ఇక ఈ సినిమా కాకుండా రాజ్ తరుణ్ పాంచ్ మినార్, చిరంజీవ సినిమాలతో బిజీగా ఉన్నాడు.
Also Read : Suriya : కార్తితో సినిమా తీసిన డైరెక్టర్ కి.. ఫేవరేట్ కార్ గిఫ్ట్ ఇచ్చిన సూర్య.. డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్..