#BRO కు వర్షాల ఎఫెక్ట్ : ఓపెనింగ్స్ కష్టమేనా..?

వర్షాల ఎఫెక్ట్ పవన్ కళ్యాణ్ BRO ఓపెనింగ్స్ ఫై భారీగా పడనున్నట్లు తెలుస్తుంది

Published By: HashtagU Telugu Desk
Rains to affect ‘Bro’ openings

Rains to affect ‘Bro’ openings

రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు (Rains) దంచికొడుతున్నాయి. ముఖ్యంగా నాల్గు రోజులుగా తెలంగాణ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ఈ ఎఫెక్ట్ పవన్ కళ్యాణ్ BRO ఓపెనింగ్స్ ఫై భారీగా పడనున్నట్లు తెలుస్తుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్సాయి ధరమ్ తేజ్ లు ప్రధాన పాత్రల్లో సముద్రఖని డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ “బ్రో” (BRO). త్రివిక్రమ్ మాటలు , స్క్రీన్ ప్లే అందిస్తుండగా తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. భారీ అంచనాల నడుమ ఈ మూవీ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల విడుదలైన సాంగ్స్ , టీజర్, ట్రైలర్ ఇవన్నీ కూడా సినిమా ఫై అంచనాలు రెట్టింపు చేసాయి. దీంతో బ్రో ఓపెనింగ్స్ (BRO Movie Openings) రికార్డ్స్ బ్రేక్ చేస్తాయని అంత అనుకున్నారు. కానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు బ్రో ఓపెనింగ్స్ ఫై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇంత వర్షంలో ప్రేక్షకులు థియేటర్స్ కు వచ్చి సినిమా చూస్తారా..? అని అంత మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ పోయి చూద్దాం అనుకున్న చాల రోడ్లు తెగిపోయాయి. వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో సినిమా చూసేందుకు ఎలా వస్తారనేది ప్రధాన చర్చ గా నడుస్తుంది.

సినిమా బాగుంటే జనాలు థియేటర్లకు వస్తారు అని మరికొంతమంది అంటున్నారు. ఒకప్పుడు జగదేక వీరుడు టైంలోను ఇలాగే వరదలు వచ్చాయి. కానీ అభిమానులు , సినీ ప్రేక్షకులు వరదలను లెక్కచేయకుండా సినిమా చూసారని అంటున్నారు. ఇప్పుడు బ్రో విషయంలో కూడా అదే జరుగబోతుందని అంటున్నారు. మాములుగా అయితే పవన్ కళ్యాణ్ సినిమా కు మొదటి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామి ఉంటుంది. సినిమా కు హిట్ టాక్ వస్తే..మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఒకవేళ సినిమా బాగాలేకపోయిన నిర్మాతలు , కానీ డిస్ట్రబ్యూటర్స్ కానీ నష్టపోరు. ఆ రేంజ్ లో కలెక్షన్లు వస్తుంటాయి. అందుకే పవన్ తో సినిమాలు చేసేందుకు నిర్మాతలు పోటీపడుతారు. ప్రస్తుతం అయితే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా వర్షం అనేది లేదు. రేపు ఎలా ఉంటుదనేది చూడాలి. మరోపక్క అభిమానులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా థియేటర్స్ వద్ద ప్లెక్సీలు , భారీ కటౌట్స్ ఏర్పాటు చేస్తున్నారు.

 Read Also: Heavy Rains: తెలంగాణలో రికార్డుస్థాయిలో కురిసిన వర్షాలు

  Last Updated: 27 Jul 2023, 12:40 PM IST