Site icon HashtagU Telugu

Rahul – Chinmayi : రాహుల్ అండ్ చిన్మయి ప్రేమ కథ.. ఎవరి వల్ల ఎప్పుడు కలిశారో తెలుసా?

Rahul Ravindran Chinmayi Sripada love story how they met

Rahul Ravindran Chinmayi Sripada love story how they met

స్టార్ సింగర్ చిన్మయి(Chinmayi)కి పరిచయం అవసరం లేదు. తన మెస్మరైజింగ్ వాయిస్ తో ఎంతోమంది సంగీత ప్రియులను కట్టిపడేస్తుంది. అంతేకాదు కొంతమంది హీరోయిన్స్ కి గొంతు అరువు ఇచ్చి డబ్బింగ్ వాయిస్ తో కూడా ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. ‘ఏ మాయ చేసావే'(Ye Maya Chesave) సినిమాలో సమంత(Samantha)కి డబ్బింగ్ చెప్పిన చిన్మయి తన వాయిస్ తో ప్రతి ఒక్కర్ని మాయలో పడేసింది. ఇక అదే వాయిస్ తో టాలీవుడ్(Tollywood) యాక్టర్ రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) ని కూడా మాయలో పడేసింది.

అందాల రాక్షసి సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన రాహుల్.. మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు. ఇక ఆ సినిమా సమయంలోనే రాహుల్ అండ్ చిన్మయికి పరిచయమైంది. అందాల రాక్షసి సినిమాలో హీరోయిన్ గా నటించిన లావణ్య త్రిపాఠికి చిన్మయి డబ్బింగ్ చెప్పింది. ఆ సినిమా డైలాగ్స్ ని చిన్మయికి తమిళంలో వివరించడానికి డైరెక్టర్ కి తమిళం రాకపోవడంతో.. రాహుల్, చిన్మయి దగ్గరకి వెళ్లాల్సి వచ్చింది. అలా వారిద్దరి తొలి పరిచయం అయ్యింది. ఆ మూవీ డబ్బింగ్ టైంలో రాహుల్ కి చిన్మయి పై ప్రేమ పుట్టింది.

ఆ తరువాత ఒకసారి చిన్మయికి రాహుల్ ఒక మెసేజ్ చేశాడట. ‘అంత అందమైన వాయిస్ పెట్టుకొని నువ్వు ఇంకా సింగల్ గా ఉన్నావా’ అని భయంతో ఒక మెసేజ్ చేశాడట. దానికి ఆమె నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే కొనసాగుదాం అనుకున్నాడట. ఇక చిన్మయి నుంచి కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో వారి ఇద్దరి ప్రేమ కథ ముందుకు సాగింది. ముందు రాహుల్ కొద్దిగా ఆమెను పొగడటం, ఆమెను డేట్ కి రమ్మనడం చేయడంతో.. ఇలాంటి వాటికి చిన్మయి పాజిటివ్ గా స్పందించడంతో రాహుల్ ఫస్ట్ ప్రపోజ్ చేశాడట. డైరెక్ట్ పెళ్లి చేసుకున్నదామని అడిగాడట. చిన్మయి నుంచి కొంచెం టైం తీసుకొని పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో తర్వాత ఇరు ఫ్యామిలీలను ఒప్పించి 2014 లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వీరిద్దరికి కవల పిల్లలు ఉన్నారు. రాహుల్ యాక్టర్‌గా – డైరెక్టర్‌గా సాగుతుంటే, చిన్మయి సింగర్‌గా – డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతుంది.

 

Also Read : NBK 109 : బర్త్‌డే రోజు బాలయ్య సర్‌ప్రైజ్.. NBK 109 సినిమా ఓపెనింగ్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?