మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కెరీర్ స్టార్టింగ్ లో.. ఒక పక్క చిన్న సినిమాల్లో హీరోగా చేస్తూనే, ఇతర హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రలు, విలన్ గా నటిస్తూ వచ్చాడు. ఈక్రమంలోనే నందమూరి తారక రామారావు(NTR) ‘తిరుగులేని మనిషి’, శోభన్ బాబు(Sobhan Babu) ‘మోసగాడు’ సినిమాల్లో ముఖ్య పాత్రలు చేశాడు. ఈ రెండు సినిమాలను డైరెక్ట్ చేసింది దర్శకుడు కె రాఘవేంద్రరావు. ఈ చిత్రాల్లో రాఘవేంద్రరావు(Raghavendra Rao).. చిరంజీవికి అవకాశం ఇవ్వడానికి ఒక ముఖ్య కారణం ఉందట.
రాఘవేంద్రరావు డైరెక్షన్ లో చిరంజీవి నటించిన ఫస్ట్ మూవీ ‘మోసగాడు’. ఈ సినిమాలో శోభన్ బాబు హీరోగా నటించగా, హీరోయిన్ శ్రీదేవి ద్విపాత్రాభినయం చేశారు. మూవీలోని నెగటివ్ రోల్ శ్రీదేవి పాత్ర పక్కన కనిపించేందుకు ఒక స్టార్ కావాల్సి వచ్చింది. ఆ స్టార్ కోసం ఆలోచిస్తున్న సమయంలో రాఘవేంద్రరావుకి చిరంజీవి బెస్ట్ ఆప్షన్ గా కనిపించాడట. చిరంజీవి అనగానే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తుకు వచ్చేది.. ఆయన డాన్స్‌లు, స్టైలిష్ ఫైట్స్. ఈ రెండు విషయాలు అప్పటిలో ప్రతి ఒక్కరిని విపరీతంగా ఆకట్టుకున్నాయి.
దీంతో చిరంజీవిని ఆ సినిమాలో తీసుకుంటే.. శ్రీదేవితో ఒక పాట, శోభన్ బాబుతో ఒక ఫైట్ చేయించవచ్చని భావించి చిరంజీవికి మొదటి ఛాన్స్ ఇచ్చారు. ఆ ఆలోచన బాగా హిట్ అవ్వడంతో.. తరువాత ఎన్టీఆర్‌తో తెరకెక్కించిన ‘తిరుగులేని మనిషి’ సినిమాలో మళ్ళీ చిరుకి అవకాశం ఇచ్చాడు. ఇది కూడా బాగా వర్క్ అవుట్ అయ్యింది. ఇక ఈ రెండు చిత్రాలు తరువాత చిరంజీవినే తన హీరోగా చేసి రాఘవేంద్రరావు ‘అడవి దొంగ’ సినిమా తెరకెక్కించారు. ఆ మూవీ మంచి విజయం సాధించింది. ఆ తరువాత వీరిద్దరి కలయికలో.. కొండవీటి రాజా, జగదేక వీరుడు అతిలోక సుందరి, ఘరానా మొగుడు వంటి బ్లాక్ బస్టర్స్ తో మొత్తం 14 సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి.
Also Read : Bigg Boss : కుండ బద్దలు కొడుతూ..హౌస్ సభ్యుల ఫై నాగ్ సీరియస్