Site icon HashtagU Telugu

Raghavendra Rao : మెగా ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లిన రాఘవేంద్ర రావు.. ఆ సినిమా సీక్వెల్ వర్కౌట్ అవ్వదు అంటూ..

Raghavendra Rao Gives Clarity On Jagadeka Veerudu Athiloka Sundari Sequel

Raghavendra Rao

Raghavendra Rao : ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్ చేయాలని ఫ్యాన్స్, పలువురు టాలీవుడ్ స్టార్స్ కూడా అనుకుంటారు. కానీ అవి కార్యరూపం దాల్చాలనుకుంటే కష్టమే. అలంటి వాటిల్లో చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి ఒకటి. మెగాస్టార్ కెరీర్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమాల్లో జగదేక వీరుడు అతిలోక సుందరి ఒకటి. 1990 లో రిలీజయిన ఈ సినిమా భారీ విజయం సాధించింది.

అయితే ఈ సినిమాకు సీక్వెల్ కూడా తీస్తారని గతంలో వార్తలు వచ్చాయి. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మాణంలో రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి, శ్రీదేవి జంటగా తెరకెక్కించారు. ఈ సినిమా సీక్వెల్ ని చిరంజీవి తనయుడు రామ్ చరణ్, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తో తీస్తే బాగుంటుందని ఫ్యాన్స్, చిరంజీవి కూడా భావించారు.

ఓ సమయంలో చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ గురించి మాట్లాడుతూ.. రామ్ చరణ్, జాన్వీ కపూర్ తో రాఘవేంద్రరావు పర్యవేక్షణలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వినీదత్ కుమార్తెలు నిర్మాతలుగా తెరకెక్కిస్తే బాగుంటుంది అని అన్నారు. అయితే తాజాగా ఈ సీక్వెల్ పై రాఘవేంద్రరావు స్పందించారు. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా మే 9 రీ రిలీజ్ చేస్తున్నారు.

ఈ రీ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ అంత ఈజీ కాదు. ఆ సినిమాలో పాటలు, సీన్స్ ఒక్కోటి ఆణిముత్యంలా ఉంటాయి. ఇప్పుడు సీక్వెల్ తీస్తే దాంతో కంపేర్ చేస్తారు. చిరంజీవిని రామ్ చరణ్ మ్యాచ్ చేసినా శ్రీదేవిని మాత్రం ఎవరూ మ్యాచ్ చేయలేరు. ఆవిడ ప్లేస్ లో ఎవర్ని ఊహించుకోలేము. ఈ సినిమా సీక్వెల్ అనేది చాలా రిస్కీ ప్రాజెక్టు అని అన్నారు.

దీంతో జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ ఉండదు అని ఇండైరెక్ట్ గా చెప్పేసారు. రాఘవేంద్రరావు వ్యాఖ్యలతో మెగా ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. మరి భవిష్యత్తులో ఏమైనా జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ ప్లాన్స్ చేస్తారేమో చూడాలి.

 

Also Read : Chiranjeevi : సినిమా బడ్జెట్ కంటే రీ రిలీజ్ బడ్జెట్ నాలుగు రేట్లు ఎక్కువ.. మెగాస్టార్ సినిమా..