Site icon HashtagU Telugu

Neha Shetty : రాధిక వెనక వాళ్లిద్దరు ఉన్నారా..? నేహా శెట్టి పెద్ద ప్లాన్ తోనే దిగింది..!

Nehashetty

Nehashetty

Neha Shetty నేహా శెట్టి అంతకుముందు తెలుగులో ఆమె చేసిన సినిమాలేవి ఆమెకు అంతగా గుర్తింపు తీసుకు రాలేదు కానీ డీజే టిల్లు మాత్రం అమ్మడి రేంజ్ మార్చేసింది. ఆ సినిమాలో రాధిక గా నేహా శెట్టి నటన ఆకట్టుకుంది. ఆ సినిమా హిట్ తో వరుస అవకాశాలు నేహా చెంత చేరాయి. కార్తికేయన్ హీరోగా వచ్చిన బెదురులంక 2012 సినిమాతో కూడా హిట్ అందుకుంది నేహా శెట్టి.

ప్రస్తుతం ఆమె విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నటిస్తుంది అమ్మడి. టాలీవుడ్ కెరీర్ సంతృప్తి కరంగా ఉందంటున్న రాధిక అదేనండి నేహా శెట్టి అసలు తను సినిమాల్లోకి రావాలనుకున్న సందర్భం గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. చిన్నప్పటి నుంచి తనకు హీరోయిన్ అవ్వాలని ఉండేదని. ఐశ్వర్య రాయ్, దీపిక పదుకొనెల స్పూర్తితో వరి లానే మోడల్ గా ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ అవుదామని అనుకున్నా అన్నారు.

మోడల్ గా ఎక్కువగా కొనసాగించలేకపోయినా తన కెరీర్ మీద వారిద్దరి ఇంపాక్ట్ ఉంటుందని అంటుంది నేహా శెట్టి. విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి హిట్ పడితే అమ్మడు మరిన్ని క్రేజీ ఛాన్స్ లు అందుకునే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు.

Also Read : Deepika Padukone : ఆ హీరోయిన్ ప్రెగ్నెన్సీ స్టార్ హీరో ఫ్యాన్స్ అప్సెట్..!