Warning To Manchu Vishnu: మంచు విష్ణుకు వార్నింగ్ ఇచ్చిన రాచ‌కొండ సీపీ!

నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ వివాద సందర్భంగా జరిగిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నమోదైన కేసుల విషయంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు 126 బిఎన్ఎస్ ప్రకారం జిల్లా అదనపు మేజిస్ట్రేట్ హోదాలో నోటీస్ ఇవ్వడం జరిగింది.

Published By: HashtagU Telugu Desk
Warning To Manchu Vishnu

Warning To Manchu Vishnu

Warning To Manchu Vishnu: రాచకొండ కమిషనర్ కార్యాలయంలో మంచు విష్ణు (Warning To Manchu Vishnu) విచారణ ముగిసింది. మరోసారి శాంతిభద్రతలు విఘాతం కలిగేలా వ్యవహరించవద్దని రాచ‌కొండ‌ సీపీ సుధీర్ బాబు విష్ణుకి వార్నింగ్ ఇచ్చారు. ప్రైవేట్‌ సెక్యూరిటీ, బౌన్సర్లతో గొడవలకు పాల్పడవద్దని ఆదేశించారు. ఇంటి దగ్గర ఇబ్బందులు ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని విష్ణుకి సూచించారు. శాంతి భద్రతలు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క‌మిష‌న‌ర్ ఆఫీసు నుంచి బ‌య‌టికి వ‌చ్చిన త‌ర్వాత మీడియాతో మాట్లాడేందుకు విష్ణు నిరాక‌రించాడు.

రాచకొండ సీపీ ముందు మంచు మనోజ్ బైండోవర్

నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ వివాద సందర్భంగా జరిగిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నమోదైన కేసుల విషయంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు 126 బిఎన్ఎస్ ప్రకారం జిల్లా అదనపు మేజిస్ట్రేట్ హోదాలో నోటీస్ ఇవ్వడం జరిగింది. దీనికి స్పందిస్తూ మంచు మనోజ్ నేరేడ్ మెట్‌లోని పోలీస్ కమిషనరేట్ లో రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ ముందు హాజరయ్యారు.

Also Read: Minister Ponguleti: ఇందిరమ్మ ఇండ్ల‌పై మంత్రి పొంగులేటి కీల‌క ప్ర‌క‌ట‌న‌!

వారి కుటుంబ వివాదాల నేపథ్యంలో జరిగిన గొడవకు సంబంధించి విషయాలలో మంచు మనోజ్ వాంగ్మూలం తీసుకున్నారు. కుటుంబ వివాదాలను శాంతి భద్రతల సమస్యగా మార్చకూడదని, ఇరు వర్గాలు శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. వారి కుటుంబ వివాదాల నేపథ్యంలో వారి చర్యలు సమాజంలోని ఇతర వ్యక్తులకు, ఆ చుట్టుపక్కల ప్రజల శాంతికి భంగం కలిగించే విధంగా ఉన్నట్లయితే చర్య తీసుకోవడం జరుగుతుందన్నారు. మరోసారి గొడవలు జరిగితే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించి సంయమనం పాటించాలని సూచించారు. కమిషనర్ ఇచ్చిన ఆదేశాల మేరకు మంచు మనోజ్ ఒక సంవత్సరం కాలం పాటు శాంతి కాపాడడానికి ఎలాంటి ప్రతికూల చర్యలకు దిగకుండా ప్రజాశాంతికి భంగం కలిగించకుండా ఉంటానని బాండ్ ఇవ్వడం జరిగింది.

ఇదే రోజు సాయంత్రం మోహన్ బాబు పెద్ద కుమారుడు అయిన మంచు విష్ణు కూడా రాచకొండ పోలీస్ కమిషనర్ ముందు హాజరయ్యారు. అనంతరం కమిషనర్ కి తన తరఫు వాదనలు వినిపించి తనకు కోర్టు 24వ తేదీ వరకు ఇచ్చినటువంటి ఉత్తర్వుల గురించి తెలియ‌జేశారు. ఇట్టి వివాదంలో అక్కడ ఎలాంటి సమస్యలు సృష్టించవద్దని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించరాదని క‌మిష‌న‌ర్ తెలియ‌జేశారు. తర్వాత కోర్టు ఉత్తర్వుల ప్రకారం తదుపరి చర్యల గురించి తెలియజేయడం జరుగుతుందని అప్పటివరకు శాంతి భద్రత ఎలాంటి విఘాతం కలిగించిన వారి మీద తగిన చర్యలు ఉంటాయని ఆదేశించారు.

  Last Updated: 11 Dec 2024, 11:44 PM IST