Raasi : ఆ డైరెక్టర్ వల్లే నా జీవితం నాశనమైంది – నటి రాశి

ఈ మూవీలోని మల్లి క్యారెక్టర్ కారణంగా తాను ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నానని.. ఇందులో గోపీచంద్‌తో పరిమితికి మించి రొమాంటిక్ సీన్లలో నటించడం కొంప ముంచిందని రాశి పేర్కొంది

Published By: HashtagU Telugu Desk
Rashi Teja

Rashi Teja

చైల్డ్ ఆర్టిస్ట్ గా చిత్రసీమలో అడుగుపెట్టిన రాశి (Raasi)…శుభాకాంక్షలు మూవీ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకుంది. ఇందులో సైడ్ క్యారెక్టర్ చేసినప్పటికీ యూత్ ను ఆకట్టుకుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో గోకులంలో సైతం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ హిట్ తర్వాత రాశి వెనుకకు చూసుకోవాల్సిన పనిలేకుండా పోయింది. తెలుగు , తమిళ్ , కన్నడ ఇలా పలు భాషల్లో దాదాపు 100 సినిమాల వరకు చేసింది. ఇదే క్రమంలో కొత్త హీరోయిన్ల ఎంట్రీ తో రాశి కి ఆఫర్స్ తగ్గడం స్టార్ట్ అయ్యాయి. అయినప్పటికీ ఐటెం సాంగ్స్, విలన్ గా కూడా పలు సినిమాలు చేసింది. ఇటీవల బుల్లితెర కు ఎంట్రీ ఇచ్చి పలు సీరియల్స్ లలో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా ఓ ఇంటర్వ్యూ లో డైరెక్టర్ తేజ (Director Teja) ఫై కీలక వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. తేజ – మహేష్ బాబు కలయికలో నిజం మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ లో గోపీచంద్ విలన్ గా నటించగా..రాశి కూడా విలన్ పాత్ర చేసింది. ఈ పాత్ర చేయడం వల్ల తన సినీ కెరియర్ నాశనం అయ్యిందని తాజాగా చెప్పుకొని బాధపడింది. ఈ మూవీలోని మల్లి క్యారెక్టర్ కారణంగా తాను ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నానని.. ఇందులో గోపీచంద్‌తో పరిమితికి మించి రొమాంటిక్ సీన్లలో నటించడం కొంప ముంచిందని రాశి పేర్కొంది. దర్శకుడు తేజ నిజం సినిమాలో తన పాత్ర గురించి చెప్పింది ఒకటి, చూపించింది మరొకటన్నారు. మొదటి నుంచి ఇష్టం లేకుండానే ఆ పాత్ర చేశానని.. షూటింగ్ మొదలైన మొదటిరోజే స్పాట్‌ నుంచి వెళ్లిపోదామని అనుకున్నానని కానీ అడ్వాన్స్ తీసుకోవడం వల్ల నటించాల్సి వచ్చిందని రాశి వెల్లడించారు. నెగిటివ్ షేడ్స్ ఉన్నప్పటికీ మంచి మార్కులే పడినా.. కొంతమంది అభిమానులు మాత్రం తనను అలాంటి సీన్స్‌లో చూసి ఇబ్బంది పడ్డారని తెలిపింది. ప్రస్తుతం రాశి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Also : Corporations Chairmens : నామినేటెడ్ పోస్టుల పండుగ.. 35 కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం

  Last Updated: 08 Jul 2024, 01:12 PM IST