Site icon HashtagU Telugu

PVR Multiplex : హమ్మయ్య.. ఇకపై పీవీఆర్ మల్టీప్లెక్స్‌లలో యాడ్స్ గోల తగ్గినట్టే..?

Pvr Multiplex Trying to Reduce Ads Timing in Movie

Pvr Multiplex Trying to Reduce Ads Timing in Movie

PVR Multiplex : సినిమా చూడటానికి థియేటర్స్ కి వెళ్తే సినిమా ముందు, ఇంటర్వెల్ లో యాడ్స్ వేస్తారని తెలిసిందే. లోకల్ థియేటర్స్ లో ఏవో మూడు, నాలుగు లోకల్ యాడ్స్ వేస్తారు. కానీ మల్టీప్లెక్స్ థియేటర్స్ కి వెళ్తే యాడ్స్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఇక పీవీఆర్ మల్టీప్లెక్స్‌ లలో అయితే సినిమా మొదలయ్యే ముందు కనీసం 20 నిముషాలు యాడ్స్ వస్తాయి.

దీంతో సినిమా చూద్దామని వచ్చిన ప్రేక్షకులకు అసహనం వచ్చేస్తుంది. ఇంటర్వెల్ లో కూడా మళ్ళీ యాడ్స్ తో పాటు రాబోయే సినిమాల ట్రైలర్స్ ప్లే చేస్తారు. ఈ యాడ్స్ ద్వారా కూడా పీవీఆర్ మల్టీప్లెక్స్‌ భారీగా సంపాదిస్తుంది. అయితే ఇటీవల ఈ యాడ్స్ పై ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో పీవీఆర్ మల్టీప్లెక్స్‌ వెనక్కి తగ్గింది.

ప్రస్తుతం పీవీఆర్ మల్టీప్లెక్స్‌ లలో ఒక సినిమాకి మొత్తంగా దాదాపు 35 నిముషాలు యాడ్స్ కి కేటాయించారు. దీనివల్ల సినిమా కంప్లీట్ అయ్యే సమయం కూడా పెరుగుతుంది. పీవీఆర్ మల్టీప్లెక్స్‌ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తమ స్క్రీన్స్ లో యాడ్స్ సమయాన్ని 35 నిమిషాల నుంచి 10 నిమిషాలకు తగ్గించడానికి ప్లాన్ చేస్తుంది. దీని వల్ల ఇంకో షో కూడా ఎక్స్ ట్రా వేసుకోవచ్చు అని చూస్తుంది. కాకపోతే యాడ్స్ రూపంలో వచ్చే డబ్బులు తగ్గితే షో పెంచుకొని ఆదాయం పెంచాలని చూస్తుంది పీవీఆర్ మల్టీప్లెక్స్‌. ప్రస్తుతం బెంగుళూరు, ముంబైలలోని కొన్ని స్క్రీన్స్ లో ఈ విధానం అమలుచేసింది పీవీఆర్ మల్టీప్లెక్స్‌. త్వరలో పూణేలో కూడా అమలు చేయనున్నారు. త్వరలోనే తర్వాత దేశమంతా యాడ్స్ తగ్గించడం అమలు చేయనున్నట్టు పీవీఆర్ మల్టీప్లెక్స్‌ భావిస్తుందని సమాచారం.

 

Also Read : Satyabhama : కాజల్ ‘సత్యభామ’ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. నవీన్ చంద్రతో చందమామ మెలోడీ..