రాకింగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ (Devisri)..ఈ మధ్య తన తరుచు వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. గత కొంతకాలంగా దేవి హావ పూర్తిగా తగ్గిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో పుష్ప 2 కు సంబంధించి..దేవి పై మేకర్స్ ఫుల్ ఫైర్ గా ఉన్నట్లు కొద్దీ రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. టైం కు దేవి శ్రీ మ్యూజిక్ ఇవ్వలేకపోయాడని..దేవి వల్లే ఆలస్యం అయ్యిందని..చివరకు సినిమా బ్యాక్ గ్రౌండ్ విషయంలో దేవిని తప్పించాల్సి వచ్చిందని మొన్నటివరకు ప్రచారం జరిగింది. ఈ వార్తలపై బలం చేకూర్చేలా తాజాగా పుష్ప (Pushpa ) సాంగ్ ఈవెంట్ లో దేవి శ్రీ కామెంట్స్ చేసాడు.
నిర్మాత రవి (Producer Ravi)గారికి నాపై ప్రేమ కంటే కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నాయని దేవిశ్రీప్రసాద్ అన్నాడు. “నేను టైమ్‌కు పాట ఇవ్వలేదు…టైమ్‌కు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు…టైమ్‌కు పోగ్రామ్‌కు రాలేదని అనొద్దు” అని దేవిశ్రీప్రసాద్ చెప్పాడు. నేను స్టేజ్ ఎక్కి ఎక్కువ సేపు మాట్లాడాలని అనుకోవద్దని నిర్మాతలతో దేవిశ్రీప్రసాద్ తెలిపాడు. తాను కరెక్ట్ టైమ్‌కు ఈవెంట్‌కు వచ్చానని, కెమెరా ఎంట్రీ అని చెప్పి తనను ఆపేశారని దేవిశ్రీప్రసాద్ తెలిపాడు. కిస్సిక్ సాంగ్ వస్తుందని పరిగెత్తుకుంటూ స్టేజ్ దగ్గరకు వచ్చానని దేవిశ్రీప్రసాద్ అన్నాడు.
రాంగ్ టైమింగ్ సార్…. లేట్ అంటూ నిర్మాత రవి తనతో అన్నారని దేవిశ్రీప్రసాద్ చెప్పాడు. లోపలికి వస్తానంటే తనను రానివ్వకపోతే నేనేం చేయగలను అని దేవిశ్రీప్రసాద్ అన్నాడు. ఇవన్నీ సఫరేట్‌గా అడిగితే పెద్ద కిక్ ఉండదు. ఇలా అడిగితేనే కిక్…నేను ఎప్పుడూ ఇంతే ఓపెన్‌గా ఉంటా. ఎప్పుడూ ఆన్ టైమ్‌కే వస్తా అని దేవి చెప్పుకొచ్చాడు. అంతే కాదు మనకు ఏం కావాలన్న అడిగి తీసుకోవాలి…నిర్మాత దగ్గర పేమెంట్ అయినా…స్క్రీన్ మీద క్రెడిట్ అయినా సరే అంటూ కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యాడు. ఇక దేవి మాటలు విన్న వారంతా పుష్ప నిర్మాతలకు – దేవి కి మధ్య గొడవ అనేది నిజమే అని ఫిక్స్ అయ్యారు. అయితే దేవి శ్రీ ప్రసాద్లో తమకు ఎలాంటి విభేదాలు లేవని మైత్రి ప్రొడ్యూసర్ రవి శంకర్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఆయనతో సినిమాలు చేస్తామని తెలిపారు. ‘మా వాళ్లకి ప్రేమ ఉంటుంది. కానీ ఈ మధ్య కంప్లైంట్స్ ఎక్కువయ్యాయని దేవి శ్రీ ప్రసాద్ అన్నారు. అందులో మాకు తప్పు కనపడలేదు’ అని పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికి దేవి శ్రీ నోటి వెంట అలాంటి వ్యాఖ్యలు రావడం పై చాలామంది విమర్శిస్తున్నారు.
Read Also : Pregnancy Tips: కడుపులో బిడ్డ హెల్తీగా పెరగాలంటే గర్భిణీ స్త్రీలు వీటిని తినాల్సిందే?