పుష్ప 2 రిలీజై బాక్సాఫీస్ దగ్గర దాని ప్రభావం చూపిస్తుంది. పాన్ ఇండియా లెవెల్ లో సంచలనాలు సృష్టిస్తున్న పుష్ప 2 సినిమా గురించి టాలీవుడ్ నుంచి ఎవరు ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. ఐతే రాజమౌళి పుష్ప 2 ని స్పెషల్ గా చూస్తున్నారని చెప్పుకొచ్చారు. బాలా నగర్ మైత్రి మేకర్స్ విమల్ థియేటర్ లో పుష్ప 2 సినిమాను రాజమౌళి వీక్షిస్తారని టాక్ వచ్చింది. అసలైతే సోమవారమే రాజమౌళి సినిమా చూస్తున్నారని అన్నారు. కానీ ఆయన చూశారా లేదా అన్నది మాత్రం తెలియలేదు.
పుష్ప 2 (Pushpa 2) సినిమా నేషనల్ వైడ్ గా ఇంత భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేయగా సినిమా గురించి రాజమౌళి ఎలా స్పందిస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది. పుష్ప 1 టైం లోనే ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ చేయమని సుకుమార్ కు రాజమౌళి సలహా ఇచ్చారు. ఈమధ్యనే జరిగిన Allu Arjun పుష్ప 2 సక్సెస్ ప్రెస్ మీట్ లో కూడా సుకుమార్ అది ప్రస్తావిస్తూ రాజమౌళికి థాంక్స్ చెప్పారు.
ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైట్..
పుష్ప 2 సినిమాను రాజమౌళి చూశారా లేదా చూస్తే ఇంకా ఎందుకు స్పందించలేదు. రాజమౌళి (Rajamouli) రివ్యూ ఎలా ఉండబోతుంది. ఇలాంటి విషయాలన్నీ ఫ్యాన్స్ ని సూపర్ ఎగ్జైట్ చేస్తున్నాయి. ఐతే పుష్ప 2 సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఇన్ని ప్రభంజనాలు సృష్టిస్తున్నా టాలీవుడ్ నుంచి ఏ ఒక్కరు మాట్లాడకపోవడం షాకింగ్ గా ఉంది.
పుష్ప 2 ని ఆడియన్స్ తమ భుజాన వేసుకుని సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. ఇప్పటికే సినిమా నాలుగు రోజుల్లోనే 829 కోట్లు కొల్లగొట్టింది. సినిమా ఫాస్టెస్ట్ 1000 కోట్ల సినిమాగా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read : Manchu Family Dispute : ‘మంచు’ ఫ్యామిలీ వివాదంలో రాజకీయ కోణం ఉందా ? ఏ పార్టీ ఎవరికి సపోర్ట్ ?