Pushpa Disaster: రష్యాలో పుష్ప డిజాస్టర్.. అల్లు అర్జున్ కు షాక్!

అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప మూవీ ఇండియాలో సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. కానీ రష్యాలో మాత్రం ఘోరంగా ఫెయిల్ అయ్యింది.

Published By: HashtagU Telugu Desk
Pushpa disaster allu arjun

Pushpa 2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ కాంబినేషన్ తెరకెక్కిన పుష్ప-1 (Pushpa) సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ పాన్-ఇండియా చిత్రం విడుదలైన అన్ని భాషల్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను కొల్లగొటింది. బాలీవుడ్ లోనూ భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇటీవలే రష్యాలో ఈ చిత్రాన్ని విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమా ప్రమోషన్ కోసం భారీ మొత్తం వెచ్చించగా, చిత్ర ప్రమోషన్ కోసం పుష్ప (Pushpa) టీమ్ రష్యా వెళ్లింది. అయితే, నిపుణుల అంచనాల ప్రకారం పుష్ప అంచనాలను అందుకోలేకపోయింది.

రష్యాలో భారీ స్థాయిలో విడుదలై మంచి కలెక్షన్లు రాబట్టడంలో పుష్ప విఫలమైందని పరిశీలకులు అంటున్నారు. సినీ ప్రియులను థియేటర్లకు రప్పించడంలో పుష్ప క్రిటిక్స్ అంటున్నారు. రష్యాలో సరైన ఓపెనింగ్స్ రాలేదని సమాచారం. మొదటి రోజు టాక్ చాలా గొప్పగా ఉన్నప్పటికీ, రోజురోజుకూ మాత్రం కలెక్షన్లు పడిపోయాయి. పుష్ప ఈ నెల 8న రష్యాలో విడుదలైంది. చిత్ర ప్రమోషన్‌లో టీమ్ పుష్ప తన బెస్ట్ ఇచ్చింది. స్థానిక మీడియాకు బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇంటర్వ్యూలు సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేశాయి. అయితే ఇవన్నీ ఏమాత్రం ఉపయోగపడలేకపోయాయి. సినీ క్రిటిక్స్ ప్రకారం అల్లు అర్జున్ నటించిన చిత్రం రష్యాలో డిజాస్టర్‌గా ముగిసింది.

రష్యాలో పరిస్థితులు కూడా అంతగా బాగాలేవు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇతర దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి ప్రజల ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా లేదు. ఈ పరిస్థితులన్నీ పుష్ప బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడానికి దారితీసి ఉండవచ్చు. భారతదేశంలో (India) నమోదు చేసిన సంచలన విజయాన్ని రష్యాలో పునరావృతం చేయడంలో విఫలమైంది. పుష్ప చాలా ఎక్కువ థియేటర్లలో విడుదలైంది. అయినా కలెక్షన్లు రాబట్టడంలో ఘోరంగా విఫలమైంది.

Also Read: Janhvi Kapoor: అదిరే అదిరే.. జాన్వీ అందాలు అదిరే!

 

  Last Updated: 14 Dec 2022, 03:39 PM IST