Samantha Song: పుష్ప-2 ను రిజక్ట్ చేయలేదు.. స్పెషల్ సాంగ్ పై సమంత రియాక్షన్

పుష్ప-2 సినిమాలో సమంత మళ్లీ ఐటం సాంగ్ చేస్తుందా? ఆమె ఆ ఆఫర్ ను రిజక్ట్ చేసిందా? అనే రూమర్స్ ప్రస్తుతం ఆసక్తిని రేపుతున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Samantha Item Song

Samantha Item Song

అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప (Pushpa) మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ మూవీలో అల్లు అర్జున్ నటన ఎంతమందిని ఆకట్టుకుందో, అంతకుమించి సమంత డ్యాన్స్ కూడా అందర్నీ అట్రాక్ట్ చేసింది. తాజాగా పుష్ప2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో పార్ట్ 2 మూవీ ఐటమ్ సాంగ్ కోసం సమంతను మేకర్స్ కాంటాక్ట్ అయ్యారని, అయితే సమంత ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందనీ వార్తలు వెలువడ్డాయి.

సమంత రియాక్షన్

దీంతో సమంత (Samantha) టీం ఈ రూమర్స్ పై రియాక్ట్ అయ్యింది. అయితే, ఇందులో వాస్తవం లేదు. పుష్ప నిర్మాతలు సమంతను సంప్రదించలేదు అని తెలిపింది. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మొద్దూ అంటూ చెప్పింది. పుష్ప సినిమాలోని సమంత స్పెషల్ సాంగ్ ఊ అంటావా అనే పాట సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఈ పాట సోషల్ మీడియాను ఓ ఊపు ఉపేసింది. మొదటిసారి స్పెషల్ సాంగ్ చేసి ఫ్యాన్స్ ను ఫుల్ టు ఎంటర్ టైన్ చేసింది. పుష్ప2లో సమంత (Samantha) మరో స్పెషల్ సాంగ్ చేస్తుందా? లేదా? అనేది వేచి చూడాల్సిందే!

ఖుషి షురూ..

లైగర్ తర్వాత విజయ్ ప్రస్తుతం ఖుషి సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది. ఇక ఆ తర్వాత సమంత (Samantha) ఆరోగ్య కారణాల వల్ల షూటింగ్ ఆగిపోయింది. కాగా తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమా కొత్త షెడ్యూల్ మార్చి మొదటి వారం నుంచి షురూ కానుందని తెలుస్తోంది.. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో ఇతర కీలకపాత్రల్లో జయరామ్, సచిన్ ఖడేకర్, అలీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు మలయాళీ సినిమా హృదయం ఫేమ్ హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. ప్యాన్ ఇండియా (Pan india) స్థాయిలో వస్తోంది.

https://youtu.be/BH5g36xHhRE

Also Read: Sir First Review: ఈ మాస్టార్ మనసులను గెలిచాడా!

  Last Updated: 17 Feb 2023, 04:06 PM IST