Site icon HashtagU Telugu

Pushpa 2 : వామ్మో..’పుష్ప-2′ టికెట్ ధర రూ.3000.. ఎక్కడంటే..?

Pushpa 2 3k

Pushpa 2 3k

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – నేషనల్ క్రాష్ రష్మిక (Allu Arjun-Rashmika) జంటగా..లెక్కల మాస్టర్ సుకుమార్ (Sukumar) డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ పుష్ప 2 (Pushpa 2). మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా పుష్ప మేనియా నడుస్తుంది. మేనియా నేపథ్యంలో అన్ని చోట్ల టికెట్స్ ధరలు ఆకాశానికి తాకుతున్నాయి.

తాజాగా ‘పుష్ప-2’ మూవీ టికెట్స్ ఆన్లైన్ బుకింగ్స్ మొదలవగా హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. అయితే, ముంబై జియో వరల్డ్ డ్రైవ్లోని PVRలో ఒక్క టికెట్ కు అత్యధికంగా రూ.3000గా ఉండటంతో అంతా షాక్ అవుతున్నారు. అయినప్పటికీ బుక్ చేసుకోవడం ఆశ్చర్యం వేస్తుంది. దీని బట్టి చెప్పొచ్చు ‘పుష్ప-2’ క్రేజ్ ఎలా ఉందొ..!

ఇక తెలంగాణ వ్యాప్తంగా టికెట్ ధరలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిసెంబరు 4న రాత్రి 9:30 గంటల బెనిఫిట్ షోతో పాటు, అర్ధరాత్రి 1 గంటకు అదనపు షోలకు కూడా అనుమతి మంజూరు చేసింది.

డిసెంబరు 5 నుంచి 8 వరకు:

సింగిల్ స్క్రీన్‌లో టికెట్ ధర రూ.150 పెరుగుదల
మల్టీప్లెక్స్‌లలో రూ.200 పెంపు
డిసెంబరు 9 నుంచి 16 వరకు:
సింగిల్ స్క్రీన్‌లో రూ.105 పెంపు
మల్టీప్లెక్స్‌లలో రూ.150 పెంపు
డిసెంబరు 17 నుంచి 23 వరకు:
సింగిల్ స్క్రీన్‌లో రూ.20
మల్టీప్లెక్స్‌లలో రూ.50 అదనంగా ఛార్జ్ చేయడానికి అనుమతి ఇచ్చింది.

ఢిల్లీ, ముంబైలో ధరలు చూస్తే..పుష్ప 2 ది రూల్ టికెట్ రేట్స్ ఢిల్లీలో రూ.1,800 ఉండగా.. ముంబైలో రూ.1,600కు చేరుకున్నాయి. అలాగే, బెంగళూరులో పుష్ప 2 టికెట్ వెయ్యి రూపాయలు పలుకుతున్నాయి.

Read Also : Pushpa 2 : అల్లు అర్జున్.. నంద్యాలలో ప్రీరిలీజ్ పెట్టండి – ఎంపీ రిక్వెస్ట్