Site icon HashtagU Telugu

Pushpa 2 The Rule Trailer: పుష్ప అంటే ఫైర్ కాదు.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న పుష్ప‌-2 ట్రైల‌ర్‌!

Pushpa 2 The Rule Trailer

Pushpa 2 The Rule Trailer

Pushpa 2 The Rule Trailer: దేశ‌వ్యాప్తంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ‘పుష్ప-2 ది రూల్’ ట్రైలర్ (Pushpa 2 The Rule Trailer) ఆదివారం విడుదలైంది. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలోకి రానుంది. ఇక ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్ ఈవెంట్‌ను బీహార్‌లోని పాట్నాలో భారీగా తరల వచ్చిన అభిమానుల మధ్య విడుద‌ల చేశారు. అల్లు అర్జున్‌కు జోడీగా రష్మిక మందన్నా నటించగా, ఫహద్ ఫాసిల్, అనసూయ, సునీల్ కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ మూవీలో జ‌గ‌ప‌తి బాబు కూడా ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

Also Read: Maruti Brezza: ఎస్‌యూవీ అమ్మ‌కాల్లో నెంబ‌ర్ వ‌న్‌గా నిలిచిన బ్రెజ్జా.. దీని ధ‌ర ఎంతంటే?

ఇక‌పోతే ఈ మూవీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ‌చ్చే నెల 5న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. ఇప్ప‌టికే ఈ మూవీపై ప్ర‌పంచ వ్యాప్తంగా విప‌రీత‌మైన బ‌జ్ ఉంది. పుష్పను మించి పుష్ప-2ను సుకుమార్ తీర్చిదిద్దిన‌ట్లు ట్రైల‌ర్‌లోని విజువ‌ల్స్ చెబుతున్నాయి. మ‌రోవైపు ఈ మూవీతో బ‌న్నీ యాక్టింగ్‌లో మ‌రో మెట్టు ఎక్క‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఆ జాత‌ర ఎపిసోడ్ ఫైట్ షాట్ కేవ‌లం కొన్ని సెక‌న్లు మాత్ర‌మే ట్రైల‌ర్‌లో సెట్ చేశారు. మొత్తానికి ట్రైల‌ర్ మాత్రం ఫుల్ మాస్‌గా చూపించారు. ఈ మూవీ ట్రైల‌ర్‌లో అల్లు అర్జున్ మేన‌రిజ‌మ్స్‌, చెప్పిన డైలాగులు, బ‌న్నీ స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి.

ర‌ష్మిక మంద‌న్నా పుష్ప రాజ్ భార్య‌గా అద‌ర‌గొట్టిన‌ట్లు ట్రైల‌ర్ లో చెబుతున్నారు. ఫహద్ ఫాసిల్, అనసూయ, సునీల్‌లు కూడా ట్రైల‌ర్ క‌ట్‌లో క‌నిపించారు. అయితే ఫ‌హ‌ద్ ఫాసిల్ చివ‌ర‌లో పుష్ఫ అంటే ఫైర్ క‌దా అని అంటే బ‌న్నీ వెన‌క ఉన్న అత‌ని అనుచ‌రులు, బ‌న్నీ క‌లిసి పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని చెప్ప‌టంతో ట్రైల‌ర్ ముగుస్తుంది.

‘పుష్ప 2’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ పాట్నాలోని గాంధీమైదాన్‌లో విడుద‌లైన విష‌యం తెలిసిందే. దేశ నలుమూలల నుంచి వేలాది అభిమానులు అక్కడకు చేరుకుని సందడి చేశారు. ‘పుష్ప రాజ్‌.. తగ్గేదేలే’ అంటూ తమ అభిమాన నటుడికి అభివాదం చేశారు. వారి కేరింతలతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది.