Allu Arjun: వామ్మో.. అల్లు అర్జున్ కు ఏకంగా అన్ని కోట్ల ఆస్తి ఉందా?

  • Written By:
  • Publish Date - April 8, 2024 / 06:30 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ గురించి మనందరికి తెలిసిందే. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ వహిస్తున్న పుష్ప 2 సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా 2012 లో విడుదల అయిన పుష్ప1 కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join
తరచూ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ మూవీపై విడుదలవుతున్న అప్డేట్లు సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తున్నాయి. కాగా పుష్ప 2 సినిమా ఆగస్ట్ 15 న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా అల్లు అర్జున్ కి సంబందించిన ఒక వార్త వైరల్ అవుతోంది. ఇక ఈరోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడం విశేషం. ఆయన 42వ ఏటా అడుగుపెడుతున్నారు. ఈ సందర్బంగా ఫ్యాన్స్, సినీ ప్రముఖులు బన్నీకి విషెస్ తెలియజేశారు. ఇక పుష్ప2 నుంచి కూడా టీజర్ విడుదలై ట్రెండింగ్ లోకి వసమచ్చింది.

Also Read: Aarti Chabria: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. నెల కిందటే అమ్మా అయ్యానంటూ!

ఈ క్రమంలో అల్లు అర్జున్ ఆస్తుల విలువ ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. బన్నీ సినిమాలు చేయడంతో పాటు పలు వ్యాపారాలు, ఆస్తులను కూడబెట్టడంలోనూ ముందున్నారు. ఈ సందర్బంగా ఆయన మొత్తం ఆస్తి విలువ ఎంత ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమాకు రూ.100 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నారు. ఆయనకు హైదరాబాద్‌లో అల్లు స్టూడియోస్, AAA మల్టీప్లెక్స్, ప్రైవెట్ జెట్, రూ.100 కోట్లు విలువ గల విశాలమైన సొంత ఇల్లు ఉంది. అలాగే బన్నీ జోమటో, రాపిడో, ఆస్ట్రాల్, మెబైల్స్ కంపెనీలకు అంబాసిడర్ గానూ వ్యవహరిస్తూ కోట్లట్లో సంపాదిస్తున్నారు. ఇక బన్నీకి ఉన్న మొత్తం ఆస్తుల విలువ రూ.460 కోట్లుగా పలు నివేదికలు వెల్లడించాయి.

Also Read: Kannappa : మంచు విష్ణు ‘కన్నప్ప’లో మరో స్టార్.. బాలీవుడ్ నుంచి ఆ హీరో..