Pushpa 2 Success Party పుష్ప 2 సినిమా పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ రిజల్ట్ అందుకుంది. ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ అంతా కూడా 3 ఏళ్లు శ్రమించారు. ఐతే వారి కష్టానికి తగిన ఫలితం వచ్చిందని చెప్పొచ్చు. పుష్ప 2 సినిమా రిలీజైన దగ్గర నుంచి ప్రతి రోజు కలెక్షన్స్ తో సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది. ఐతే పుష్ప 2 రిలీజ్ టైం లో కొన్ని కారణాల వల్ల మేకర్స్ పార్టీ చేసుకోలేదు. కానీ లేటెస్ట్ గా పుష్ప 2 యూనిట్ ప్రైవేట్ పార్టీ చేసుకున్నట్టు తెలుస్తుంది.
ఈ పార్టీలో అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్, శ్రీలీల, దేవి శ్రీ ప్రసాద్, మైత్రి నిర్మాతలు నవీన్, రవిశంకర్, చంద్రబోస్, కెమెరా మెన్ కూబా ఇలా అందరు పాల్గొన్నారు. ఈ ప్రైవేట్ పార్టీకి సంబందించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పుష్ప 2 సక్సెస్ పార్టీ లో మేకర్స్ అంతా కూడా సంతోషంగా కనిపిస్తున్నారు.
అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డ్..
ఇక పుష్ప 2 (Pushpa 2) చూసిన ప్రతి ఒక్కరు కూడా మరోసారి అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డ్ గ్యారెంటీ అనేస్తున్నారు. సినిమాతో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు అల్లు అర్జున్. సినిమాలో రెండు మెయిన్ సీన్స్ లో అల్లు అర్జున్ నటన నిజంగానే పూనకాలు తెప్పించేలా చేసింది.
అందుకే సినిమా అంతగా ఆడియన్స్ కు రీచ్ అయ్యింది. పుష్ప 2 సినిమా వసూళ్ల హంగామా చూస్తుంటే ఈ జాతర ఇప్పుడప్పుడే ముగిసేలా లేదు. ఆల్ టైం రికార్డులతో అదరగొడుతున్న పుష్ప 2 ఫుల్ రన్ లో సరికొత్త సంచలనంగా మారనుంది.
Also Read : Death In Pushpa-2 Theatre: పుష్ప-2 థియేటర్‌లో ప్రేక్షకుడి అనుమానాస్పద మృతి