అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో భారీ అంచనాలతో వస్తున్న పుష్ప 2 సినిమా గురించి రిలీజ్ దగ్గర పడుతుండటం వల్ల ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ కి ఫెస్టివల్ వైబ్ అందిస్తుంది. ముఖ్యంగా సినిమా సెన్సార్ అయిన దగ్గర నుంచి ఈ చర్చ మరింత పెరిగింది. పుష్ప 2 సినిమాలో చాలా వావ్ మూమెంట్స్ ఉన్నాయట. వాటిలో ప్రత్యేకంగా ఒక సింగిల్ టేక్ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందని అంటున్నారు.
పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ (Allu Arjun) పూనకాలు తెప్పించేయడం పక్కా అనేస్తున్నారు. పుష్ప 2 సినిమాపై ఉన్న అంచనాలకు ఈ సినిమా నుంచి వస్తున్న ఈ లీక్స్ కు మరింత క్రేజ్ ఏర్పడుతుంది. సినిమా కచ్చితంగా భారీ ఓపెనింగ్స్ తెచ్చేలా కనిపిస్తుంది. పుష్ప 2 సినిమా కోసం సుకుమార్ 3 ఏళ్లు టైం తీసుకున్నా పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్ అందించేందుకు రెడీ అయ్యాడని తెలుస్తుంది.
పుష్ప 2 (Pushpa 2) సినిమాలో రష్మిక మందన్న (Rashmika) హీరోయిన్ గా నటించగా శ్రీలీల ఒక స్పెషల్ సాంగ్ లో చేసింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో థమన్, అజనీష్ లోక్ నాథ్ కూడా బిజిఎం అందించినట్టు తెలుస్తుంది. పుష్ప 2 డిసెంబర్ 5న 11 వేలకు పైగా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు ఇంప్రెస్ చేస్తుందని మేకర్స్ చెబుతున్నారు. మరి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.
సినిమాను ప్రమోట్ చేయడంలో మాత్రం పుష్ప 2 టీం ఒక రేంజ్ ప్లానింగ్ లో ఉన్నారు. పాట్నాతో మొదలై చెన్నై, కొచ్చి ఇలా అంతటా పుష్ప 2 మేనియా కొనసాగించేలా చూస్తున్నారు.
Also Read : Vijay Devarakonda : రౌడీ పుష్ప.. అల్లు అర్జున్ కి విజయ్ స్పెషల్ గిఫ్ట్..!