అందరు భావించినట్లే బాక్స్ ఆఫీస్ వద్ద పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్ చేయడమే కాదు మరో సినిమాకు ఆ ఛాన్స్ ఉంటుందో అనే రీతిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. తాజాగా నైజాం లో అరుదైన రికార్డు సాధించి వార్తల్లో నిలిచింది. అల్లు అర్జున్(Allu Arjun) ప్రధాన పాత్రలో నటించిన ‘పుష్ప-2’ (Pushpa 2)సినిమా భారత సినిమా చరిత్రలో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. సుకుమార్(Sukumar) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు ముందే పలు రికార్డ్స్ సాధించింది.పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 05 న విడుదలైన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ మంచి హైప్‌ను సృష్టించింది. అల్లు అర్జున్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, సుకుమార్ డైరెక్షన్, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సినిమాలోని ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులను అలరించేలా ఉండడం.. ప్రధానంగా అల్లు అర్జున్ పాత్రకు సంబంధించిన యాక్షన్ సీన్లు, ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ముగ్ధులను చేస్తున్నాయి. రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ వంటి నటుల ఆకట్టుకునే పాత్రలతో పాటు చక్కని సినిమాటోగ్రఫీ కూడా ‘పుష్ప-2’కి ప్లస్ పాయింట్‌గా మారాయి. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది.
ఇక ఫస్ట్ డే నైజాంలో ఆల్ టైం రికార్డు సాధించింది. తాజా PR లెక్కల ప్రకారం ఏకంగా రూ.25 కోట్లకు పైగా రాబట్టింది. దీంతో గతంలో ఉన్న అన్ని రికార్డులు బ్రేక్ అయ్యాయని సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ మూడు రోజులు కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని , టికెట్ ధరలు పెరగడం తో కలెక్షన్లు బాగా పెరిగాయని అంటున్నారు. మరి సోమవారం నుండి ఎలా ఉంటాయనేది చూడాలి. పుష్ప 2 చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా దాదాపు రూ. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించగా.. ప్రమోషన్ కార్యక్రమాలు దీనికి అదనం. ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 రికార్డు స్థాయిలో రూ. 617 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ కింద రూ. 425 కోట్ల వ్యాపారం చేసింది పుష్ప 2. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ రూ. 275 కోట్లతో ఈ సినిమా డిజిటల్ రైట్స్ దక్కించుకుందట. అలాగే శాటిలైట్ రైట్స్ కింద రూ. 85 కోట్లు, రూ. 65 కోట్లు మ్యూజిక్ రైట్స్ కింద బిజినెస్ చేసి గతంలో ఏ తెలుగు సినిమాకు జరగని స్థాయిలో వ్యాపారం జరిగినట్లు సమాచారం. భారతీయ చిత్ర పరిశ్రమలోనే కనీవినీ ఏరుగని రీతిలో వరల్డ్ వైడ్‌గా దాదాపు 11000 వేల స్క్రీన్‌లలో పుష్ప 2ని రిలీజ్ చేశారు మేకర్స్. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్లుగా తెలుస్తోంది.
ఇక హిందీ మార్కెట్‌లో అల్లు అర్జున్ సంచలనం సృష్టించాడు. హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా పుష్ప 2 నిలిచింది. ఇప్పటి వరకు ఈ రికార్డు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ (65 కోట్లు) పేరిట ఉండగా.. అల్లు అర్జున్ దానిని బద్ధలుకొట్టాడు. అంతేకాదు.. ఇండియా వైడ్ అత్యధిక ఓపెనింగ్స్ రికార్డు ఆర్ఆర్ఆర్ (160 కోట్లు) పేరిట ఉండగా దీనిని కూడా పుష్ప 2 (190 కోట్లు) క్రాస్ చేసేసింది. అలాగే రెండు భాషల్లో (హిందీ, తెలుగు) ఒకే రోజున రూ. 50 కోట్ల నెట్ కలెక్షన్స్‌ని సాధించిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది.
Read Also : Sobhita- Naga Chaitanya: శ్రీశైలం మల్లన్న సేవలో శోభిత, నాగ చైతన్య