పుష్ప-2 (Pushpa 2)సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన రేవతి(Revathi) కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ ఆర్థిక సాయాన్ని అందజేశారు. సోమవారం చిత్ర నిర్మాత నవీన్ బాధిత కుటుంబాన్ని కలుసుకొని రూ.50 లక్షల చెక్కును అందజేశారు. డిసెంబర్ 4న పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటన పట్ల యావత్ సినీ ప్రముఖులు, ప్రజలు దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. ప్రతి ఒక్కరూ రేవతి కుటుంబాన్ని అన్ని రకాలుగా ప్రభుత్వం , చిత్రసీమ ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం తరుపు రూ.25 లక్షలు ప్రకటించారు. పుష్ప-2 చిత్ర హీరో అల్లు అర్జున్ కూడా బాధిత కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మరోపక్క ఈ ఘటన పట్ల పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయడంతో కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించింది. కానీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడం తో ఓ రోజులోనే బయటకు వచ్చాడు. ప్రస్తుతం మాత్రం ఈ ఘటన కు అల్లు అర్జునే కారణం అని పోలీసులు గట్టిగా చెపుతూ..ఆధారాలు బయటపెడుతున్నారు.
Read Also : Harish Rao : కాంగ్రెస్ నేతలు అసెంబ్లీని అబద్ధాల వేదికగా మార్చారు: హరీష్ రావు