Site icon HashtagU Telugu

‘Pushpa 2’ సంచలనం.. 6 రోజుల్లోనే రూ.1000 కోట్లు!

Pushpa 2 1000 Cr

Pushpa 2 1000 Cr

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ (Pushpa 2) సినిమా రూ.వెయ్యి కోట్ల (Rs.1000 Cr) క్లబ్లో చేరి సరికొత్త రికార్డు సాధించింది. సినీ చరిత్రలోనే అత్యంత వేగంగా ఏ చిత్రం సాధించలేని అరుదైన రికార్డు పుష్ప 2 సాధించింది. ఈనెల 5న ఈ చిత్రం విడుదలవగా కేవలం ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్లు సాధించి రికార్డు నెలకొల్పింది.

ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత తక్కువ రోజుల్లో ఈ ఫీట్ సాధించిన తొలి సినిమా‌గా పుష్ప 2 నిలిచింది. ఈ విషయాన్ని చూసి ట్రేడ్ విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోయారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ వంటి భారీ చిత్రాలను కూడా దాటేసి పుష్ప 2 ఈ ఘనత సాధించడం అనూహ్య విజయం అని కొనియాడుతున్నారు. ఉత్తరాదిలో కూడా పుష్ప 2 వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తూ వస్తుంది. పుష్ప 2 విడుదలైన మొదటి రోజునే షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా రికార్డును బ్రేక్ చేయడం అందర్నీ షాక్ కు గురి చేసింది. ముంబై, పాట్నా, రాయ్ గడ్ వంటి ప్రధాన ప్రాంతాల్లో హౌస్ ఫుల్ బోర్డులతో పుష్ప 2 రన్ అవుతుంది. ఇప్పట్లో మరో పెద్ద సినిమా లేకపోవడం తో రాబోయే రోజుల్లో పుష్ప 2 ఖాతాలో మరెన్నో రికార్డ్స్ చేరతారని సినీ విశ్లేషకులు అంటున్నారు.

ప్రస్తుతం హౌస్ ఫుల్ తో రన్ అవుతున్న ఈ మూవీ తాలూకా ఓటిటి స్ట్రీమింగ్ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం పుష్ప 2 మేకర్స్ తో సుమారు రూ. 250 కోట్ల‌కు డీల్ సెట్ చేసుకున్న‌ట్లు సమాచారం. ఇక ఈ సినిమా స్ట్రీమింగ్‌ సంక్రాంతి తర్వాతే ఉండవచ్చని తెలుస్తోంది. థియేట్రిక‌ల్ ర‌న్ పూర్తైన త‌ర్వాత తమ ప్లాట్‌ఫామ్‌పై ఈ సినిమా తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో అందుబాటులో ఉంటుంద‌ని నెట్‌ఫ్లిక్స్ తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్ల‌డించింది.

Read Also : Trump Team Assets: ట్రంప్ అండ్ టీమ్ ఆస్తులు రూ.32.41 లక్షల కోట్లు.. 172 దేశాల జీడీపీ కంటే ఎక్కువే!