Site icon HashtagU Telugu

Pushpa 2 : చరణ్-ఎన్టీఆర్ ల రికార్డు ను బన్నీ బ్రేక్ చేయగలడా..?

Pushpa 2 Rrr

Pushpa 2 Rrr

ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌లో మరో భారీ సంచలనం సృష్టించేందుకు ‘పుష్ప-2: ది రూల్’ (Pushpa 2) సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ‘RRR’ చిత్రం రూ. 223 కోట్లతో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు కలిగి ఉంది. అయితే, ‘పుష్ప-2’ ఈ రికార్డును అధిగమించే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – నేషనల్ క్రాష్ రష్మిక (Allu Arjun-Rashmika) జంటగా..లెక్కల మాస్టర్ సుకుమార్ (Sukumar) డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ పుష్ప 2 (Pushpa 2). మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా పుష్ప మేనియా నడుస్తుంది. మేనియా నేపథ్యంలో అన్ని చోట్ల టికెట్స్ ధరలు ఆకాశానికి తాకుతున్నాయి. ఇప్పటివరకు మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఇండియన్ సినిమాగా ‘RRR’ (రూ. 223కోట్లు) పేరిట రికార్డు ఉంది. మరో 3 రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న ‘పుష్ప-2’ ఈ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాకు సౌత్తో పాటు నార్త్ ఉన్న క్రేజ్, టికెట్ల ధరల పెంపు దృష్ట్యా ఓపెనింగ్ డే వసూళ్లు రూ. 250 కోట్లు-రూ. 300 కోట్లు మధ్యలో రావొచ్చని అంటున్నారు.

‘పుష్ప-1’ హిట్ కావడం.. ముఖ్యంగా ఈ చిత్రంలోని “తగ్గేదే లే” డైలాగ్, సాంగ్స్, పుష్పరాజ్ క్యారెక్టర్ ఇమేజ్ ఇలా అన్ని కూడా పుష్ప 2 పై అంచనాలు పెంచేసాయి. అందుకే ఈసారి వసూళ్ల పరంగా పుష్ప-2 మునుపటి రికార్డులను తిరగరాయడం గ్యారెంటీ అని సినీ పరిశ్రమ భావిస్తుంది. చూద్దాం మరి పుష్ప 2 ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తాడో..? ఏ రేంజ్ లో వసూళ్లు రాబడతాడో..!!

ప్రస్తుతం హైదరాబాద్ లో పుష్ప 2 వైల్డ్ జాతర పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్ లో ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ మొదలైంది. మరోపక్క ఈ ఈవెంట్ కారణంగా.. ట్రాఫిక్ పోలీసులు సోమవారం ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు . ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రయాణికులు సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల మధ్య ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని కోరారు. ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి కోట్ల విజయభాస్కర్ స్టేడియం వైపు వెళ్లే ట్రాఫిక్‌ను కృష్ణానగర్ జంక్షన్ వద్ద శ్రీనగర్ కాలనీ-పంజాగుట్ట వైపు మళ్లిస్తున్నారు.

Read Also : Rangareddy District :ఘోర రోడ్డు ప్రమాదం..10 మంది మృతి