అల్లు అర్జున్ పుష్ప 2 (Pushpa 2) కోసం దేవి శ్రీ తో పాటుగా మరో ముగ్గురు సంగీత దర్శకులను Sukumar వాడేస్తున్నారని తెలుస్తుంది. డిసెంబర్ 5న సినిమా రిలీజ్ చేయాలంటే బిజిఎం కి దేవి శ్రీ (DSP) ఒక్కడే అయితే టైం కుదరదని మరో ముగ్గురిని పిక్ చేసుకున్నారు. వారిలో థమన్ (Thaman) కూడా ఉన్నాడు. ఐతే థమన్ షార్ట్ టైం లో బిజిఎం మొత్తం ఇవ్వాలని అంటే తాను కుదరదని చెప్పేశాడని తెలుస్తుంది. రీసెంట్ గా డాకు మహారాజ్ టీజర్ రిలీజ్ టైంలో ఇదే విషయాన్ని చెప్పాడు.
ఐతే దేవి శ్రీ, థమన్ కాకుండా మరో ఇద్దరు క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్స్ పుష్ప 2 కి పనిచేస్తున్నారని తెలుస్తుంది. వాళ్లిద్దరు ఎవరంటే కాంతారా మ్యూజిక్ డైరెక్టర్ అంజనీష్ లోక్ నాథ్ తో పాటుగా సామ్ సిఎస్ అని తెలుస్తుంది. ఈ ఇద్దరు కూడా వారి పాటలతో పాటు బిజిఎం తో అరుపులు పెట్టిస్తున్నారు.
2 రీల్స్ కి మాత్రమే కంపోజ్..
పుష్ప 2 కోసం దేవి మ్యాజిక్ తో పాటు ఈ ముగ్గురు సంగీత దర్శకులు కూడా తమ బిజిఎం తో మెప్పిస్తారని తెలుస్తుంది. థమన్ ఇప్పటికే తాను కేవలం 2 రీల్స్ కి మాత్రమే కంపోజ్ చేశానని చెప్పాడు. థమన్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే పుష్ప 2 చూసి తనకు భయం వేసిందని సినిమా అంత అద్భుతంగా ఉందని.. కచ్చితంగా అల్లు అర్జున్ ని మరిన్ని అవార్డులను తెచ్చి పెడుతుందని అన్నాడు.
Allu Arjun పుష్ప 2 ఊపు చూస్తుంటే అది నిజమే అనిపించేలా ఉంది. పుష్ప 2 సినిమా తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాదు నార్త్ లో కూడా సూపర్ క్రేజ్ ఏర్పరచుకుంది. నేడు పుష్ప 2 ట్రైలర్ వేడుకకు నార్త్ ఆడియన్స్ అంతా పాట్నా చేరుకుని అక్కడ తమ హంగామా చూపిస్తున్నారు.
Also Read : Jyothika – Kanguva : కంగువా బాగాలేదంటూ జ్యోతిక కామెంట్స్