పుష్ప 2 కలెక్షన్స్ అందరిలో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అల్లు అర్జున్(Allu Arjun) ప్రధాన పాత్రలో నటించిన ‘పుష్ప-2’ (Pushpa 2)సినిమా భారత సినిమా చరిత్రలో సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తున్నట్లు మేకర్స్ ప్రకటిస్తూ వస్తున్నారు. సుకుమార్(Sukumar) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు ముందే పలు రికార్డ్స్ సాధించింది. పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 05 న విడుదలైన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ మంచి హైప్‌ను సృష్టించింది.
అల్లు అర్జున్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ పాత్రకు సంబంధించిన యాక్షన్ సీన్లు, ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ముగ్ధులను చేస్తున్నాయి. రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ వంటి నటుల ఆకట్టుకునే పాత్రలతో పాటు చక్కని సినిమాటోగ్రఫీ కూడా ‘పుష్ప-2’కి ప్లస్ పాయింట్‌గా మారాయి. కాకపోతే టిక్కెట్ల ధరలు విపరీతంగా పెరగడం..రన్ టైం సైతం ఎక్కువగా ఉండడంతో ప్రేక్షకులు థియేటర్స్ కు వెళ్లేందుకు ఇష్ట పడడంలేదు. అదే కాక సినిమా కూడా విడుదల రోజే ఆన్లైన్ లోకి రావడం తో చాలామంది ఆన్లైన్లోనే సినిమా చూస్తున్నారు. అయినప్పటికీ మేకర్స్ వందల కోట్లు రాబడుతున్నట్లు అధికారికంగా ప్రకటిస్తుండడం అందరిలో అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా రూ.621 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తూ కొత్త చరిత్రను లిఖిస్తుందని పేర్కొంది. ఈరోజు ఆదివారం కావడంతో కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. మరి నిజంగా ఆ రేంజ్ లో కలెక్షన్లు వస్తున్నాయా..? లేక కావాలనే ఆలా ప్రచారం చేస్తున్నారా..? అనేది వారికే తెలియాలి. ఏది ఏమైనప్పటికి చాల చోట్ల మాత్రం టికెట్ ధర చూసి సినిమాకు వెళ్లాలని అనుకున్న వారు కూడా వెనక్కి వెళ్తున్నారు. రేపటి నుండి టికెట్ ధర తగ్గుతున్నాయి.
Read Also : Siddu Jonnalagadda : తెలంగాణ సర్కార్ కు రూ.15 లక్షల విరాళం అందించిన డీజే టిల్లు