ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – నేషనల్ క్రాష్ రష్మిక (Allu Arjun-Rashmika) జంటగా..లెక్కల మాస్టర్ సుకుమార్ (Sukumar) డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ పుష్ప 2 (Pushpa 2). మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ గా ఉంది. కాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసారు.
అలాగే సినిమా నిడివి వచ్చేసి 3 గంటల 18 నిమిషాలగా (Pushpa 2 Runtime) తేల్చేసారు. అలాగే సినిమా అద్భుతంగా ఉందని , అల్లు అర్జున్ యాక్టింగ్ తగ్గేదేలే అనిపించిందని , సుకుమార్ మరోసారి తనదైన స్క్రీన్ ప్లే తో అదరగొట్టాడని , నిర్మాతలు ఖర్చు విషయంలో ఎక్కడ కూడా తగ్గేదేలే అనే రేంజ్ లో ఖర్చు చేసారని , వారు పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపిస్తుందని సెన్సార్ బృందం చెప్పుకొచ్చింది. క్లాస్ , మాస్ ఇలా ప్రతి ఒక్కరికి సినిమా నచ్చుతుందని , ఈ సినిమా తో అల్లు అర్జున్ రేంజ్ మరింత పెరుగుతుందని , రష్మిక తో పాటు మిగతా నటి నటులంతా యాక్టింగ్ ఇరగదీశారని సెన్సార్ తెలిపింది.
Read Also : Dhanush-Aishwarya Divorce : ధనుష్ దంపతులకు విడాకులు మంజూరు చేసిన కోర్ట్