Site icon HashtagU Telugu

Pushpa 2 Collections : నాలుగు రోజులు.. 829 కోట్లు ఇది పుష్ప బాక్సాఫీస్ పై చేస్తున్న రూల్..!

Pushpa 2 4 Days Collections 829 Crores Pushpa Raj Boxoffice Rule

Pushpa 2 4 Days Collections 829 Crores Pushpa Raj Boxoffice Rule

అల్లు అర్జున్ (Allu Arjun,) సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా విషయంలో మేకర్స్ మొదటి నుంచి పర్ఫెక్ట్ ప్కానింగ్ తో ఉన్నారు. ఐతే పుష్ప 2 సినిమా ఫస్ట్ డే నుంచి కలెక్షన్స్ మోత మోగిస్తుంది. సినిమాకు నార్త్ సైడ్ ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ రావడంతో అక్కడ కలెక్షన్స్ ఆల్ టైం ర్కార్డులు కొల్లగొడుతుంది.

పుష్ప 2 (Pushpa 2) సినిమా ఫస్ట్ డే 294 కోట్లు, రెను రోజుల్లో 450 మూడు రోజుల్లో 640 కోట్లు ఇప్పుడు నాలుగు రోజుల్లో ఏకంగా (Pushpa 2 Collections) 829 కోట్లు కొల్లగొట్టింది. హిందీ బెల్ట్ లోనే ఈ సినిమా 200 కోట్లు రాబట్టడం విశేషం. తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా పుష్ప ప్రభంజనాలు బాగున్నాయి. పుష్ప 2 సినిమా 4 రోజుల్లోనే 829 కోట్లు రాబట్టడం ఆల్ టైం రికార్డ్ అని చెప్పొచ్చు.

నెవర్ బిఫోర్ రికార్డులు..

(PAN India) సినిమా ఫుల్ రన్ లో కచ్చితంగా నెవర్ బిఫోర్ రికార్డులు కొల్లగొట్టేలా ఉంది. పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ పూనకాల పర్ఫార్మెన్స్ ఆడియన్స్ కు మాస్ ట్రీట్ అందించింది. ఈ సినిమాలో రష్మిక గ్లామర్, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. పుష్ప 2 లాంగ్ రన్ లో 2000 కోట్లు కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చెప్పొచ్చు.

పుష్ప 2 మాత్రమే కాదు పుష్ప 3 కూడా ఉంటుందని చెప్పారు. కానీ పుష్ప 3 సినిమాకు చాలా టైం తీసుకుంటారని తెలుస్తుంది. ప్రస్తుతం పాన్ ఇండియా మొత్తం పుష్ప 2 మేనియా కొనసాగుతుంది. ఈ దూకుడు చూస్తుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఉందని అర్ధమవుతుంది.

Also Read : Rishab Shetty Prabhas : రిషబ్ శెట్టి స్టోరీ.. ప్రభాస్ హీరో.. హోంబలె కాంబో ఫిక్స్..!