Site icon HashtagU Telugu

Pushpa 2 : రెండు రోజుల్లో రూ.449 కోట్ల వసూళ్లు..తగ్గేదేలే

Pushpa 2 2day

Pushpa 2 2day

పుష్ప 2 బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది . మొదటి రోజు దాదాపు రూ.294 కోట్లు రాబట్టిన ఈ మూవీ..సెకండ్ రోజు కూడా అదే రేంజ్ లో వసూళ్లు రాబట్టింది.అల్లు అర్జున్(Allu Arjun) ప్రధాన పాత్రలో నటించిన ‘పుష్ప-2’ (Pushpa 2)సినిమా భారత సినిమా చరిత్రలో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. సుకుమార్(Sukumar) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు ముందే పలు రికార్డ్స్ సాధించింది.పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 05 న విడుదలైన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ మంచి హైప్‌ను సృష్టించింది.

అల్లు అర్జున్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, సుకుమార్ డైరెక్షన్, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సినిమాలోని ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులను అలరించేలా ఉండడం.. ప్రధానంగా అల్లు అర్జున్ పాత్రకు సంబంధించిన యాక్షన్ సీన్లు, ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ముగ్ధులను చేస్తున్నాయి. రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ వంటి నటుల ఆకట్టుకునే పాత్రలతో పాటు చక్కని సినిమాటోగ్రఫీ కూడా ‘పుష్ప-2’కి ప్లస్ పాయింట్‌గా మారాయి. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది.

ఫస్ట్ డే 294 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రికార్డ్ నెలకొల్పిన ఈ మూవీ రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.449 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఈ మైలోన్ను అతి వేగంగా చేరుకున్న సినిమాగా రికార్డు సృష్టించిందని తెలిపింది. సనిమాపై ఉన్న బజ్.. సినిమాకు వచ్చిన బ్లాక్ బస్టర్ టాక్ ఈ కలెక్షన్స్ కు కారణమని చెప్పొచ్చు. పుష్ప 2 సినిమా దూకుడు చూస్తుంటే ఈజీ గా 1000 కోట్లు కొట్టేలా ఉన్నాడు. చూద్దాం ఏ జరుగుతుందో..!

Read Also : INDIA bloc : ‘ఇండియా’ సారథిగా మమతా బెనర్జీ.. ? ఆ పార్టీల మద్దతు దీదీకే !