Balakrishna Interview : ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణను ఆయన సోదరీమణులు దగ్గుబాటి పురంధేశ్వరి, నారా భువనేశ్వరి ఇంటర్వ్యూ చేశారు. కేంద్ర ప్రభుత్వం బాలయ్యకు ఇటీవలే పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ఈసందర్భంగా నందమూరి, నారా కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌లో బాలయ్యకు పార్టీ ఇచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణను ఆయన అక్క,చెల్లెలు ఇంటర్వ్యూ (Balakrishna Interview) చేసిన వివరాలను చూద్దాం..
Also Read :Ayodhya : వెక్కివెక్కి ఏడ్చిన అయోధ్య ఎంపీ.. ప్రధాని మోడీతో మాట్లాడుతానంటూ..
నారా భువనేశ్వరి : బాల అన్నయ్య మీ మొదటి క్రష్ ఎవరు? హీరోయిన్స్‌లో ఎవరు బాగా నచ్చారు ?
బాలకృష్ణ : ‘‘నాకు ఎలాంటి క్రష్ లేదు. అయితే అందాన్ని చూసి ఆనందించే కళా దృష్టి మాత్రం ఉంది. బాగా ఇష్టమైన హీరోయిన్లు విజయశాంతి, రమ్యకృష్ణ, సిమ్రాన్’’
నారా భువనేశ్వరి: అన్నయ్య.. మీరు ఎవరికైనా లవ్ లెటర్ రాశారా?
బాలకృష్ణ : నేను వసుంధరకు లవ్ లెటర్ రాశాను. అప్పుడు తాను ఏదో గిఫ్ట్ కూడా నాకు ఇచ్చింది.
వసుంధర: నేను గిఫ్టేం ఇవ్వలేదు. ఆయనే డ్రెస్ తీసుకొని ఓ చిన్న లవ్‌లెటర్‌తో నాకు ఇచ్చారు. దాన్ని ఇప్పటికీ దాచుకున్నా.
దగ్గుబాటి పురంధేశ్వరి : వసుంధరను తొలిసారి ఎక్కడ చూశావు ?
బాలకృష్ణ: నాన్నగారు(ఎన్‌టీఆర్) వైట్‌హౌస్ వద్ద కొత్త ఇంటికి భూమిపూజ చేసిన సందర్భం నాకు బాగా గుర్తుంది. ఆ టైంలోనే తొలిసారి వసుంధరను చూశాను.
దగ్గుబాటి పురంధేశ్వరి : వసుంధరను చూసిన వెంటనే నీ రియాక్షన్ ఏంటి?
బాలకృష్ణ:వెంటనే వసుంధరను ఓకే చేశాను.
దగ్గుబాటి పురంధేశ్వరి : నువ్వు చాలా రోజులు సమాధానం చెప్పలేదని నాన్నగారు (ఎన్టీఆర్) నాతో అన్నారు. ఒకసారి బాలయ్యను తెలుసుకొని చెప్పమని నన్ను అడిగారు. నేను అప్పుడు నీతో కూర్చొని మాట్లాడాను. బాగా గుర్తుంది.
Also Read :Dry Port In Telangana : తెలంగాణలోనూ డ్రై పోర్ట్ నిర్మాణం.. ఇంతకీ అదేమిటి ?
దగ్గుబాటి పురంధేశ్వరి : నీకు పద్మభూషణ్ ఎందుకు వచ్చింది?
బాలకృష్ణ: వసుంధర నా లక్కీ వైఫ్. ఆవిడ నన్ను భరించింది. మూడోసారి హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచాను. ఆఫ్ స్క్రీన్‌లో, ఆన్ స్క్రీన్‌లో అలుపెరగకుండా నటించినందుకు నాకు ఈ అవార్డు వచ్చిందని అనుకుంటున్నా.