Arrest Warrant Against Sonu Sood: సోనూ సూద్‌పై అరెస్ట్ వారెంట్ జారీ.. ఏ కేసులో చిక్కుకున్నాడు?

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా, సినిమాల్లో పవర్ ఫుల్ పాత్రలకు పేరుగాంచిన నటుడు సోనూసూద్ చట్టపరమైన వివాదాల్లో చిక్కుకున్నారు.

Published By: HashtagU Telugu Desk
Arrest Warrant Against Sonu Sood

Arrest Warrant Against Sonu Sood

Arrest Warrant Against Sonu Sood: బాలీవుడ్ నటుడు సోనూసూద్‌పై పంజాబ్‌లోని లూథియానా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ రమణప్రీత్ కౌర్ అరెస్ట్ వారెంట్ (Arrest Warrant Against Sonu Sood) జారీ చేశారు. క్రిమినల్ కేసులో సాక్షిగా పలుమార్లు సమన్లు ​​పంపినప్పటికీ కోర్టుకు హాజరు కాకపోవడంతో నటుడిపై ఈ వారెంట్ జారీ చేశారు. అసలు ఈ కేసు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నటుడు సోనూసూద్ ఏ కేసులో ఇరుక్కున్నాడు?

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా, సినిమాల్లో పవర్ ఫుల్ పాత్రలకు పేరుగాంచిన నటుడు సోనూసూద్ చట్టపరమైన వివాదాల్లో చిక్కుకున్నారు. తాజాగా లూథియానాలోని కోర్టు నటుడిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మోసం కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు సోనూసూద్ కోర్టుకు హాజరుకాకపోవడంతో ఈ చర్య తీసుకున్నారు. లూథియానాకు చెందిన రాజేష్ ఖన్నా అనే న్యాయవాది మోసం చేశారని ఆరోపించిన కేసు ఇది. సోనూసూద్ ఫిబ్రవరి 10లోగా కోర్టుకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.

నటుడిపై అరెస్ట్ వారెంట్ జారీ

సోనూసూద్‌పై అరెస్ట్ వారెంట్ ముంబైలోని ఓషివారా పోలీస్ స్టేషన్‌కు పంపారు. నటుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని పోలీసులకు ఆదేశాలు అందాయి. కోర్టు తన ఆర్డ‌ర్‌లో.. సోనూ సూద్‌కు సమన్లు ​​వచ్చాయి. కానీ అతను వాంగ్మూలం ఇవ్వడానికి నిరాకరించాడు. అందుకే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాల‌ని ఉంది.

Also Read: Gaddafi Stadium: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ.. స్టేడియాల‌పై పాక్ కీల‌క ప్ర‌క‌ట‌న‌!

మోసం కేసులో సాక్ష్యం చెప్పాల్సి వచ్చింది

ఈ కేసు లూథియానా లాయర్ రాజేష్ ఖన్నాపై వచ్చిన మోసం ఆరోపణలకు సంబంధించినది. మోహిత్ శుక్లా అనే వ్యక్తి తనను రూ.10 లక్షలు మోసం చేశాడని ఖన్నా ఆరోపించారు. ఖన్నా ప్రకారం.., అతను నకిలీ ‘రిజికా కాయిన్’లో పెట్టుబడి పెట్టడానికి మోసపోయానని, ఈ కేసులో సోనూ సూద్ సాక్ష్యం చెప్పవలసి ఉంది. ఈ ఆరోపణ తర్వాత సోనూ సూద్‌కు సమన్లు ​​పంపారు. అయితే అతను విచారణకు కోర్టుకు హాజరు కాలేదు.

తదుపరి విచారణ ఫిబ్రవరి 10న

ఈ విషయంలో సోనూసూద్అ, తని న్యాయ బృందం నుండి ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు. అయితే తదుపరి విచారణను ఫిబ్రవరి 10వ తేదీకి వాయిదా వేస్తూ ఈ రోజున కోర్టుకు హాజరుకావాలని సోనూసూద్‌ను ఆదేశించింది. ఆరోజు కూడా సోనూసూద్ కోర్టుకు హాజరుకాకపోతే అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది.

  Last Updated: 07 Feb 2025, 09:53 AM IST