Prudhvi Raj : ఆ సినిమాలో రాముడి పాత్ర పృథ్వీరాజ్‌ చేయాలి.. కానీ..

కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ‘దేవుళ్లు’ (Devullu) చిత్రంలో కూడా పృథ్వి ఛాన్స్ అందుకొని అసహనంతో వెనుదిరిగిన సందర్భం గురించి తెలియజేశాడు.

Published By: HashtagU Telugu Desk
Prudhvi Raj miss Lord Rama Character

Prudhvi Raj miss Lord Rama Character

టాలీవుడ్(Tollywood) లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న పృథ్వీరాజ్‌(Prudhvi Raj ).. సినిమాతో పాటు రాజకీయ రంగంలోనూ బిజీగానే ఉన్నారు. అయితే ప్రస్తుతం సినిమాల పైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు. ఇన్నాళ్లు నటుడిగా అలరిస్తూ వచ్చిన పృథ్విరాజ్.. ఇప్పుడు దర్శకుడిగా మారుతూ ఒక సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో హీరోయిన్‌గా తన కూతురు శ్రీలుని, హీరోగా క్రాంతి కృష్ణ పెట్టి ‘కొత్త రంగుల ప్రపంచం’ అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు.

ఈ మూవీ కూడా రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు. ఈక్రమంలోనే తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కెరీర్ తాను చాలా మంచి పాత్రలను మిస్ చేసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. నటుడిగా తనని ఎంపిక చేసుకొని, షూటింగ్ సమయానికి తనని తప్పించి వేరే నటుడితో చిత్రీకరణ చేసిన సినిమాలు చాలా ఉన్నాయట. రాజశేఖర్‌ హీరోగా తెరకెక్కిన ఒక చిత్రంలో పృథ్విరాజ్ ఒక ముఖ్య పాత్ర కోసం ఎంపిక చేసి చిత్రీకరణ సమయానికి తప్పించారట.

ఇక కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ‘దేవుళ్లు’ (Devullu) చిత్రంలో కూడా పృథ్వి ఛాన్స్ అందుకొని అసహనంతో వెనుదిరిగిన సందర్భం గురించి తెలియజేశాడు. ఆ సినిమాలో ‘అందరి బంధువయా’ సాంగ్ లో రాముడిగా హీరో శ్రీకాంత్(Srikanth) కనిపించిన సంగతి తెలిసిందే. అయితే పాత్ర కోసం ముందుగా పృథ్విరాజ్ ని తీసుకున్నారట. కోడి రామకృష్ణ, పృథ్వికి లుక్ టెస్ట్ కూడా చేశారట.

పృథ్విరాజ్ ని రాముడి వేషధారణలో చూసి భద్రాచలం రామాలయం పూజారులు.. ‘ఎన్టీఆర్‌లా ఉన్నారు మీరు’ అని కంప్లిమెంట్ ఇచ్చారట. రాముడిగా పృథ్వి బాగున్నాడని అందరూ అన్నారట. కానీ ఏమైందో ఏమో నెక్స్ట్ డే షూటింగ్ సెట్స్ లోకి హీరో శ్రీకాంత్‌ వచ్చాడట. ఆయన కూడా ఏదైనా పాత్ర చేస్తున్నాడని పృథ్వి అనుకున్నారట. కానీ చివరికి శ్రీకాంత్‌ రాముడి పాత్రని పోషిస్తున్నాడని తెలిసి పృథ్వి చాలా బాధ పడ్డాడట. అయితే ఎందుకు తనని తప్పించారో కారణం మాత్రం పృథ్వి తెలపలేదు.

 

Also Read : Rangasthalam : అనసూయ రంగమ్మత్త పాత్రకి రాశి నో చెప్పింది.. ఎందుకు?

  Last Updated: 06 Nov 2023, 09:35 PM IST