Pathaan Protest: ‘పఠాన్’ కు నిరసన సెగ, బీహార్ లో పోస్టర్ల కాల్చివేత!

షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ (Pathaan) మూవీకి నిరసన తగిలింది.

Published By: HashtagU Telugu Desk
Pathaan

Pathaan

బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ (Pathaan) మూవీకి నిరసన తగిలింది. విడుదలకు ఒక రోజు ముందు మంగళవారం బీహార్‌ (Bihar) లోని భాగల్‌పూర్‌లోని ఓ థియేటర్ వద్ద ‘పఠాన్’ చిత్రం పోస్టర్‌లను చింపి, తగులబెట్టారు. భజరంగ్ దళ్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) కార్యకర్తలు థియేటర్ బయట నిరసన వ్యక్తం చేశారు. షారుఖ్ ఖాన్, పఠాన్ మూవీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సినిమా పోస్టర్లను (Posters) చించి, కాల్చివేశారు. ‘ఫిల్మ్ చలేగా హాల్ జలేగా’ అంటూ ఆందోళన చేశారు. భాగల్‌పూర్‌లోని దీప్‌ప్రభ సినిమా హాల్‌లో షారూఖ్ నటించిన పఠాన్ (Pathaan) చిత్రం ప్రదర్శించబడుతోంది.

“(Pathaan) సినిమాను ప్రదర్శించడానికి మేం అనుమతించం. ఫిల్మ్ చలేగా తో హాల్ జలేగా (సినిమాను ప్రదర్శిస్తే, సినిమా హాలు తగలబడుతుంది) పఠాన్ చిత్రాన్ని దేశవ్యాప్తంగా బహిష్కరిస్తాం. కాషాయ రంగును అవమానించే ఈ సినిమాను అడ్డుకుంటాం’ అని ఆందోళనకారులు నినాదాలు చేశారు. కొందరు సంఘ వ్యతిరేక వ్యక్తులు సినిమాను వ్యతిరేకిస్తూ పోస్టర్‌ను తగలబెట్టారని మేనేజర్ లాలన్ సింగ్ తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ (Police station) లో, ఎస్పీకి దరఖాస్తు చేశామని, భద్రత కల్పిస్తామని పాలనాధికారి హామీ ఇచ్చారని తెలిపారు.

Also Read: Sangameshwara Temple: కృష్ణమ్మ ఒడి నుంచి సంగమేశ్వర గర్భాలయం బయటపడుతోంది!

  Last Updated: 25 Jan 2023, 12:16 PM IST