Site icon HashtagU Telugu

Mr Bachchan : మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ పై నిర్మాత కామెంట్స్.. నేను తీసుకున్న చెత్త నిర్ణయం..

Producer TG Vishwa Prasad Comments on Raviteja Mr Bachchan Flop

Mr Bachchan

Mr Bachchan : హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ(Raviteja) హీరోగా హిందీ రైడ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ సినిమా దారుణమైన ఫ్లాప్ చూసింది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఒరిజినల్ రైడ్ సినిమా సీరియస్ గా ఎమోషన్స్ తో సాగితే మిస్టర్ బచ్చన్ మాత్రం కామెడీగా, పాటలతో లాగించేసారు. ఈ సినిమా ఫ్యాన్స్ కు కూడా నచ్చలేదు. దీనిపై దారుణమైన ట్రోల్స్ వచ్చాయి.

తాజాగా మిస్టర్ బచ్చన్ సినిమా ఫ్లాప్ పై నిర్మాత విశ్వ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఓ ఇంటర్వ్యూలో విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ.. సినిమా లాంచ్ కావడానికి ఒక్క రోజు ముందే నేను ఈ ప్రాజెక్టులోకి వచ్చాను. నేను అప్పటికే రీమేక్ అవసరమా, ఒరిజినల్ కథతో వెల్దాము అని అన్నాను. కానీ అప్పటికే చాలా లేట్ అయిపోవడంతో ఏం చేయలేకపోయాను. ఇక ఆ సినిమా షూట్ ని లక్నోలో తీయడం నేను తీసుకున్న చెత్త నిర్ణయం. పాత హిందీ పాటలు మాకు నచ్చాయి కదా సినిమా ఆడుతుంది అనుకున్నాం. కానీ ఇప్పటి ఆడియన్స్ కు అవి కనెక్ట్ అవ్వలేదు. అలాగే షూటింగ్ చాలా ఫాస్ట్ గా చేయడం కూడా మైనస్ అయింది. సినిమాలో కొన్ని సీన్స్ అయినా సరిగ్గా తీసుంటే హిట్ అయ్యేదేమో అంటూ కామెంట్స్ చేసారు.

దీంతో విశ్వ ప్రసాద్ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఈయన కామెంట్స్ తో తప్పంతా హరీష్ శంకర్ దే అని ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మిస్టర్ బచ్చన్ సినిమాలో ఏదైనా ప్లస్ ఉందంటే సాంగ్స్ , హీరోయిన్ మాత్రమే. ఆ సినిమాతో కొత్త హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సేకు మాత్రం బోలెడంత పేరు వచ్చింది.

 

Also Read : Samantha : షూటింగ్ లో స్ప్రుహ తప్పిపడిపోయిన సమంత..!