Site icon HashtagU Telugu

Tollywood : పవన్ కళ్యాణ్ నిర్మాత ఇంట విషాదం..

Producer Suryadevara Radhak

Producer Suryadevara Radhak

గత కొంతకాలంగా చిత్రసీమలో వరుస విషాద సంఘటనలు సినీ లవర్స్ ను దిగ్బ్రాంతికి గురి చేస్తున్నాయి. అనారోగ్యం, రోడ్డు ప్రమాదం, ఆత్మహత్య, గుండె పోటు వంటి కారణాలతో ప్రముఖులు తిరిగిరాని లోకాలకు వెళ్తున్నారు. ఇక వారి మరణంతో కుటుంబ సభ్యులతో పాటు వారి అభిమానులను తీవ్ర విషాదంలో నెలకొంటుంది. ఈ మధ్య బుల్లితెర నటి రోడ్డు ప్రమాదం లో మరణించగా..ఓ యాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే ఓ మోడల్ ఆత్మహత్య చేసుకుంది. ఇక ఇప్పుడు ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

హారిక హాసిని నిర్మాణ సంస్థ అధినేత, ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ ఇంట విషాదం నెలకొంది. రాధాకృష్ణ తల్లి నాగేంద్రమ్మ(90) మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హృదయ సంబంధిత వ్యాధితో గురువారం తుదిశ్వాస విడిచారు. కాగా, సూర్యదేవర నాగేంద్రమ్మ కు ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. రాధాకృష్ణ రెండో కుమారుడు కాగా, నిర్మాత సూర్యదేవర నాగవంశీకి ఆమె నాయనమ్మ అవుతారు. రేపు(మే 31) ఉదయం పది గంటలకు ఫిల్మ్ నగర్‌లోని శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే సూర్యదేవర నాగవంశీ నిర్మించిన గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి ఈ శుక్రవారమే థియేటర్లలో విడుదల కానుంది. ఈ సమయంలోనే వారి కుటుంబంలో విషాదం చోటుచేసుకోవడం మరింత బాధకు గురి చేస్తుంది.

ఇక నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చిన్న హీరోలతో పాటు పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు వంటి అగ్ర హీరోలతోను సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నారు. అలాగే పలు సినిమాలకు, సీరియల్స్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇక నాగవంశీ సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో వరుస సినిమాలను నిర్మిస్తున్నారు.

Read Also : Kalki 2898 AD : కల్కి ట్రైలర్‌లో ‘బ్రహ్మానందం’ని చూశారా.. యానిమేషన్ పాత్రలో బలే ఉన్నారు..