Trivikram : ప్రస్తుతం ఆల్మోస్ట్ అన్నిచోట్లా ఎన్నికల హడావిడి అయిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో అయితే అయిదేళ్ల తర్వాతే మళ్ళీ ఎన్నికల ప్రస్తావన. అయితే ఎన్నికలు వచ్చే సమయంలో పొలిటికల్ సినిమాలు కూడా సందడి చేస్తాయని తెలిసిందే. ప్రతిసారి ఎన్నికల ముందు పొలిటికల్ సినిమాలు కచ్చితంగా వస్తాయి. మొన్న 2024 ఎన్నికల ముందు కూడా జగన్ కోసం యాత్ర 2 సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే రాబోయే 2029 ఎన్నికల ముందు ఓ భారీ పొలిటికల్ సినిమా రాబోతుందట. లక్కీ భాస్కర్ సక్సెస్ మీట్ లో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. 2029 ఎన్నికల ముందు భారీ పొలిటికల్ సినిమా చేస్తాము అని తెలిపారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. నాగవంశీ అంటే త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంపౌండ్. అంత భారీ సినిమా చేస్తే త్రివిక్రమ్ తోనే చేయాలి. అలాగే పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గానే చేయాలి. నాగవంశీ గతంలోనే నేను జనసేన పార్టీ అని పబ్లిక్ గానే చెప్పాడు.
దీంతో నాగవంశీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవ్వగా టాలీవుడ్ సమాచారం ప్రకారం ప్రస్తుతం త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో సినిమా తీయబోతున్నాడు. ఆ సినిమా అయ్యాక త్రివిక్రమ్ పవన్ కు సపోర్ట్ గా ఉండే ఓ భారీ పొలిటికల్ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది. 2029 ఎన్నికల ముందు ఆ సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తారని సమాచారం. మరి అందులో పవన్ కళ్యాణ్ నటిస్తారా లేక ఇంకెవరైనా నటిస్తారా అనేది సందేహమే. చూడాలి మరి నిర్మాత నాగవంశీ తీయబోయే పొలిటికల్ సినిమా ఎవరికోసమో, ఎలాంటిదో..
Also Read : Daali Dhananjaya : పెళ్లి చేసుకోబోతున్న పుష్ప విలన్.. కాబోయే భార్యతో ఫోటోలు షేర్ చేసి..