టాలీవుడ్ నిర్మాత నాగవంశీ (Nagavamshi ) తాజాగా తన సినిమాలపై వస్తున్న నెగటివ్ రివ్యూల పై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల విడుదలైన ‘మ్యాడ్ స్క్వేర్’ (MAD Square) చిత్రానికి సంబంధించి కొన్ని వెబ్‌సైట్లలో నెగిటివ్ రివ్యూస్ రావడంతో ఆయన ఈ వ్యవహారంపై స్పందిస్తూ మీడియా ముందుకు వచ్చారు. ‘‘సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టే హిట్ అయ్యింది. హిట్ టాక్ తెచ్చుకున్నా, దానికి అండగా నిలవకుండా నెగటివ్ ప్రచారం చేయడమేంటి?’’ అంటూ ప్రశ్నించారు. ముఖ్యంగా ‘‘సీక్వెల్ కావడం వల్ల సినిమా ఆడుతోంది’’ అనే విమర్శలపై మండిపడ్డారు.
Anasuya : అనసూయ హాట్ థైస్ షో..చూసే ముందు పక్కన చూసుకోండి
సినిమా విడుదలైన వెంటనే నెగటివ్ ప్రచారం చేయడాన్ని తప్పుబట్టిన నాగవంశీ, రివ్యూల పేరుతో చిత్ర పరిశ్రమను అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. మ్యాడ్ స్క్వేర్ బాహుబలి2, కేజీఎఫ్2, పుష్ప2లా భారీ స్థాయి సినిమా కాదు. అయినా ప్రేక్షకులు తమ సినిమాను ఆదరిస్తున్నారు. తాను థియేటర్‌కి వెళ్లి ప్రేక్షకుల స్పందనను చూసి వచ్చా. వాళ్లకు సినిమా నచ్చింది. కానీ కొన్ని వెబ్‌సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లు కావాలనే నెగటివ్ ప్రచారం ఎందుకు చేస్తున్నాయి?’’ అని నిలదీశారు.
CM Chandrababu : ఒకప్పుడు నొక్కిన బటన్లన్నీ నేను ఇచ్చే పింఛన్లతో సమానం: సీఎం చంద్రబాబు
‘‘నా మీద పగ ఉంటే, నా సినిమాలను బ్యాన్ చేయండి. నా సినిమా గురించి రాయకండి. కానీ సినిమా ఇండస్ట్రీని మాత్రం చంపకండి’’ అంటూ ఘాటుగా స్పందించారు. ‘మేము సినిమాలు తీస్తేనే మీ వెబ్‌సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లు నడుస్తాయి. సినీ పరిశ్రమ ఆడితేనే అందరూ ముందుకు వెళ్లగలుగుతారు. సినిమా చూసే ప్రేక్షకులు, రివ్యూయర్‌లు ఎవరు నిజంగా సినిమాను అర్థం చేసుకున్నారో ఆలోచించాలి. సినిమా విజయాన్ని అడ్డుకునే ప్రయత్నాలు మానేయాలి’’ అని పేర్కొన్నాడు. ప్రస్తుతం వంశీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.