Site icon HashtagU Telugu

Priyanka Mohan : మాస్ కా దాస్ తో ప్రియాంక మోహన్..!

Priyanka Mohan Chance in Mass Ka Dass Viswak Sen Movie

Priyanka Mohan Chance in Mass Ka Dass Viswak Sen Movie

నానితో సరిపోదా శనివారంతోతో సూపర్ హిట్ అందుకుంది చెన్నై చిన్నది ప్రియాంక అరుల్ మోహన్. ఆరేళ్ల క్రితం నానితోనే గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రియాంక ఆ తర్వాత శర్వానంద్ తో శ్రీకారం చేసింది. వరుస తమిళ్ సినిమాలతో బిజీ గా ఉన్న ప్రియాంక (Priyanka Mohan) నానితో సరిపోదా శనివారం ఛాన్స్ అనుకుంది. ఆ సినిమా తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా కూడా చేస్తుంది.

సరిపోదా సక్సెస్ కాబట్టి OG మీద ఆ ఎఫెక్ట్ ఉంటుంది. పవర్ స్టార్ సినిమా టాక్ ఎలా ఉన్నా వసూళ్లు అదిరిపోతాయని తెలిసిందే. ఐతే ప్రియాంక కు మరో లక్కీ ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. ప్రియాంక అరుల్ మోహన్ టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో విశ్వక్ సేన్ సినిమాలో ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కెవి తన నెక్స్ట్ సినిమా విశక్ సేన్ తో చేస్తున్నాడు.

మాస్ కా దాస్ ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్..

ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంకని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. శివ కార్తికేయన్ తో ప్రిన్స్ సినిమా తర్వాత అసలైతే రవితేజతో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేశాడు అనుదీప్. మరి ఆ ప్రాజెక్ట్ ఏమైందో ఏమో కానీ విశ్వక్ సేన్ తో ప్రాజెక్ట్ ఫైనల్ చేసుకున్నాడు. ఈ సినిమా విషయంలో మాస్ కా దాస్ ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

రవితేజ కథతోనే ఈ సినిమా వస్తుందా లేదా మరో కథా అన్నది తెలియదు కానీ అనుదీప్ విశ్వక్ (Viswak Sen) కాంబో పై ఫ్యాన్స్ అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక తన మార్క్ చాటుతుందని నమ్ముతున్నారు.

Also Read : Devara Pramotions : దేవర ఫ్యాన్స్ ఎక్కడ తగ్గట్లేదు..!