Bollywood : భర్త పేరును తొలగించింది.. రూమర్స్ కు తెరలేపింది!

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా జోనాస్ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరు నుండి తన భర్త పేరును 'చోప్రా జోనాస్'ని తొలగించింది. ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

  • Written By:
  • Publish Date - November 23, 2021 / 11:49 AM IST

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా జోనాస్ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరు నుండి తన భర్త పేరును ‘చోప్రా జోనాస్’ని తొలగించింది. ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పెళ్లి అయిన మూడు సంవత్సరాల తర్వాత ప్రియాంక, నిక్ జోనాస్ విడాకులు తీసుకోబోతున్నారని అభిమానులు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. అయితే ఇవన్నీ బోగస్ అని ప్రియాంక స్నేహితుడు మీడియాకు స్పష్టం చేశాడు.

నవంబర్ 22న ప్రియాంక చోప్రా జోనాస్ తన ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ప్రొఫైల్‌ల నుండి ‘చోప్రా జోనాస్’ని తొలగించింది. ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫారమ్‌లోని ఆమె ప్రొఫైల్ ఇప్పుడు కేవలం ప్రియాంక అని మాత్రమే కనబడుతుంది. అయితే విడాకుల కోసం వెళుతున్నారనే పుకార్లు అవాస్తవమని వెల్లడించారు. “ఈ విడాకుల పుకార్లు అన్నీ సరదాగా ఉన్నాయి. ప్రియాంక తన మొదటి పేరును తన భవిష్యత్ ప్రాజెక్టులో ఉపయోగించాలనుకుంటుందట తప్ప, విడిపోతున్నారనే వార్తల్లో నిజం లేదు. ఇదే విషయమై ప్రియాంక స్నేహితురాలు స్పందిస్తూ.. ప్రియాంక ఎప్పుడూ ఇంటర్నెట్‌ని బ్రేక్ చేస్తుందని చెప్పింది.

అయితే ప్రియాంక తన ఇంటిపేరును తొలగించిన తర్వాత ఆమె అభిమానులు షాక్ అయ్యారు. ఇంటిపేరును వదులుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత చాలా మంది నెటిజన్స్ గందరగోళానికి గురయ్యారు. విపరీతమైన ట్వీట్ చేస్తూ.. ప్రియాంక, ఆమె భర్త నిక్ మధ్య విభేదాలు గురించి మాట్లాడుకోవడం మొదలైంది.