Site icon HashtagU Telugu

Priyanka Chopra : మహేష్ – రాజమౌళి సినిమా సెట్స్ లో ప్రియాంకచోప్రా హోలీ సెలబ్రేషన్స్.. ఫోటో వైరల్..

Priyanka Chopra Celebrates Holi in Mahesh Babu Rajamouli Movie Sets

Priyanka Chopra

Priyanka Chopra : అందరూ ఎదురుచూస్తున్న మహేష్ బాబు – రాజమౌళి సినిమా షూటింగ్ ప్రస్తుతం ఒడిశాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒడిశా డిప్యూటీ సీఎం స్వయంగా ఈ విషయం ప్రకటించింది. ఒడిశా లోని కోరాపుట్ అడవుల్లో మహేష్- రాజమౌళి సినిమా షూటింగ్ జరుగుతుంది. కొన్ని రోజుల క్రితం ఓ చిన్న వీడియో కూడా లీక్ అయింది.

ప్రియాంకచోప్రా. పృద్విరాజ్ సుకుమారన్ కూడా ఈ షూట్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ మాత్రం ఇవ్వట్లేదు. నిన్న హోలీ పండగ కావడంతో ప్రియాంక చోప్రా అక్కడ షూటింగ్ సెట్ లో హోలీ సెలబ్రేషన్స్ చేసుకుంది. ప్రియాంక తన టీమ్ తో కలిసి రంగులు పూసుకొని తన టీమ్ అందరితో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

వెనుక లొకేషన్స్ చూస్తేనే అది అడవుల్లో అని తెలుస్తుంది. ప్రస్తుతం ప్రియాంక మహేష్ – రాజమౌళి సినిమా సెట్స్ లోనే ఉండటంతో అక్కడే ఈ హోలీ సెలబ్రేట్ చేసుకొని ఫోటో పోస్ట్ చేసింది. మహేష్ ఫోటో కూడా ఒకటి పోస్ట్ చేస్తే బాగుండు అని ఫ్యాన్స్ భావించారు.

అయితే మహేష్ బాబు తన చేత్తో రంగు తీసుకుంటున్న ఫోటో ఒకటి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో కేవలం మహేష్ చెయ్యి మాత్రమే కనిపిస్తుంది. దీంతో ఈ ఫోటో కూడా అక్కడ సెట్స్ లో తీసింది అని భావిస్తున్నారు ఫ్యాన్స్.

 

Also Read : Supritha : భయపడిన సురేఖవాణి కూతురు సుప్రీత.. సారి చెప్తూ వీడియో పోస్ట్..